జ‌గ‌న‌న్న : చేప‌లు అమ్మొద్దన్నా..ప‌వ‌న్ వార్నింగ్ !

RATNA KISHORE
మ‌ద్యం అమ్మ‌కాలు వ‌ద్దు
నిషేధించండి అని అంటోంది

కానీ వైసీపీ స‌ర్కారు సంబంధిత ఆదాయం వ‌దులుకోలేకపోతోంది.దీంతో పాటు తాజాగా చేప‌ల అమ్మ‌కానికి ఔట్ లెట్లు తెచ్చి ముఖ్య ప‌ట్ట‌ణాల్లో అందుబాటులో ఉంచి,త‌ద్వారా వీటినొక ఆదాయ వ‌న‌రుగా మ‌లుచుకుంటోంది.అంటే మ‌ద్యం అమ్మ‌కాలు చేప‌ట్టి అయినా చేప‌లు అమ్మ‌కాలు చేప‌ట్టి అయినా నాలుగు డ‌బ్బులు తీసుకుంటున్నార‌ని, కానీ సంబంధిత జాల‌ర్ల ఆరోగ్యంపై మాత్రం దృష్టి ఎందుక‌ని లేకుండా పోతుంద‌ని ప‌వ‌న్ వేద‌న చెందుతున్నారు.త‌క్ష‌ణ‌మే ప్ర‌భుత్వం స్పందించాల‌ని  జ‌గ‌న్ కు వార్నింగ్ ఇస్తున్నారు.ఈ నేప‌థ్యంలో ఈ నెల 20న న‌ర‌సాపురంలో మ‌త్స్య‌కార అభ్యున్న‌తి స‌భ‌ను నిర్వ‌హించ‌నున్నారు.ఈ స‌భ‌లో జ‌గ‌న్ ను మ‌రింత‌గా టార్గెట్ చేయ‌నున్నారు ప‌వ‌న్.


ఆంధ్రావ‌ని వాకిట జ‌న‌సేన పార్టీ నేతృత్వాన మ‌త్స్య‌కార అభ్యున్న‌తి యాత్ర జ‌రుగుతోంది.కాకినాడ‌,ముమ్ముడివ‌ర్గం నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు రోజులుగా నిర్వ‌హిస్తున్నారు.మాజీ స్పీక‌ర్ , జ‌న‌సేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ నేతృత్వాన మ‌త్స్య‌కార గ్రామాల‌ను సంద‌ర్శించి వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకుంటున్నారు.ఈ సంద‌ర్భంగా క్షేత్ర స్థాయిలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై మాజీ స్పీక‌ర్ ఎప్ప‌టిక‌ప్పుడు మీడియాకు వెల్ల‌డిస్తున్నారు. చేప‌ల అమ్మ‌కాల‌కు ప్ర‌త్యేకంగా ఔట్ లెట్లు తెరిచి కొంద‌రికి ఉపాధి ఇస్తున్నామ‌ని చెబుతున్న ప్ర‌భుత్వం ఆదాయం పెంచుకునేందుకు చేస్తున్న ప్ర‌యత్నాల్లో ఇది ఒక భాగం అని చెబుతున్న ప్ర‌భుత్వం ఎందుక‌ని జాల‌ర్ల స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్ట‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

ముఖ్యంగా ఇంజినుతో న‌డిచే బోట్ల‌కు స‌బ్సిడీపై మూడు వేల లీట‌ర్ల డీజిల్ ఇవ్వాల్సి ఉండ‌గా,300లీట‌ర్ల డీజిల్ మాత్రమే ఇస్తున్నార‌ని ఆరోపించారు.అంతేకాదు మ‌త్స్యకార గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు ర‌క్షిత నీరు వీరికి అంద‌డం లేద‌ని వాపోయారు.వీటితో పాటు జాల‌రి వాడ‌ల్లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు కృషి చేయ‌కుండా వైసీపీ స‌ర్కారు నిర్ల‌క్ష్యంగా ఉంటోంద‌ని అన్నారు.ఇవ‌న్నీ ఇప్పుడు వైసీపీ స‌ర్కారును ఇర‌కాటంలో పెడుతున్నాయి.తాము మ‌త్స్య‌కార సంక్షేమానికి ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని సంబంధిత మంత్రి సీదిరి అప్ప‌ల్రాజు అంటున్నారు.వీటిని జ‌న‌సేన ఖండిస్తోంది.చేప‌లు అమ్మ‌కం, మ‌ద్యం అమ్మ‌కం వెంట‌నే మానుకుని సంబంధిత ఆదాయం వ‌ద్ద‌నుకుని  ప్ర‌జారోగ్యం కాపాడాల‌ని కోరుతోంది. కానీ ఇందుకు జ‌గ‌న్ సుముఖంగా ఉంటారా? అన్న‌దే ఓ పెద్ద ప్ర‌శ్న అని అంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: