హమ్మయ్య.. కరోనా కేసులు తగ్గాయ్?

praveen
కరోనా వైరస్ ఈ పేరు చెబితే చాలు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం చైనా నుంచి ప్రపంచ దేశాలకు పారిపోయిన కరోనా వైరస్ ప్రస్తుతం అన్ని దేశాలలో సంక్షోభాన్ని సృష్టించింది. ఇక భారత్లో కూడా ఊహించని సవాళ్లను తీసుకువచ్చింది. అయితే భారత ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో అన్ని దశలలో కూడా కరోనా వైరస్ ను ఎంతో సమర్థవంతంగా ఎదురుకో గలిగింది  అని చెప్పాలి. 130 కోట్లకు పైగా జనాభా ఉన్నప్పటికీ భారత్లో కరోనా వైరస్ అనే సవాల్ ని ఎంతో అద్భుతంగా ఫేస్ చేసింది ప్రభుత్వం.

 అదే సమయంలో తక్కువ సమయంలోనే అటు ప్రజలకు కూడా పూర్తి స్థాయి అవగాహన రావడంతో ఇక అందరూ స్వచ్చందంగా జాగ్రత్తలు తీసుకోవడం కూడా మొదలుపెట్టారు. అయితే ఇప్పటికే రెండు దశల  వైరస్ ను ఎదుర్కొన్న భారత్లో ఇటీవలే మూడవ దశ కూడా ప్రారంభమైంది. ఒకవైపు దక్షిణాఫ్రికా లో వెలుగులోకి వచ్చిన ఓమిక్రాన్ భారత్లో చాపకింద నీరులా పాకిపోయింది. ఇక మరోవైపు కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. 4 లక్షలకు పైగా కేసులు రావడంతో అందరూ ఆందోళనలో మునిగిపోయారు.

 కానీ గత కొన్ని రోజుల నుంచి దేశంలో రోజువారి కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ ఉండటం గమనార్హం. ఇక నిన్నటి తో పోల్చి చూస్తే కొత్త కేసుల సంఖ్య 11 శాతం తగ్గింది  గడచిన 24 గంటల్లో 14.50 లక్షల మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ క్రమంలోనే 44877 కొత్త పాజిటివ్ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఇటీవలే దీనికి సంబంధించిన బులిటెన్  ను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా 684 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా కరోనా వైరస్ ప్రభావం తగ్గుతూ ఉండటం తో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: