రాజుగారి కొత్త ఫిట్టింగ్‌- జగన్‌ అలా చెబితేనే రాజీనామా?

Chakravarthi Kalyan
ఎంపీ పదవికి రాజీనామా చేసేస్తున్నా.. ఇదీ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు నిన్న మొన్నటి వరకూ చెప్పిన మాట.. తనపై అనర్హత వేటు వేయించేందుకు ఆయన గతంలో ఫిబ్రవరి ఐదో తారీకు వరకూ గడువు ఇచ్చారు. అప్పట్లోగా తనపై అనర్హత వేటు వేయించాలని లేకుంటే తానే రాజీనామా చేస్తానని గతంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రకటించారు. అయితే.. ఇప్పుడు ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్వరం మారుతోంది. రాజీనామాపై ఆయన కొత్త కబుర్లు చెబుతున్నారు.


తాను 5వ తేదీనే రాజీనామా చేస్తానని చెప్పలేదంటున్నారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. సరైన సమయంలో తాను నిర్ణయం తీసుకుంటానంటున్నారు. అనర్హత వేసుకోవచ్చని ఈనెల 11 వరకు సమయమిచ్చానని కొత్త డెడ్ లైన్ పెట్టారు. అయితే ఆయన ఓ కొత్త షరతు పెట్టారు.  సీఎం జగన్ ముందుకొచ్చి.. అనర్హత వేటు వేయించడం నావల్ల కాదు... రాజీనామా చేయమని తనను అడిగితే మాత్రం వెంటనే రాజీనామా చేస్తాడట. రాజీనామా ఎప్పుడు అనేది నేను నిర్ణయిస్తానంటున్నారు రఘురామ కృష్ణంరాజు.


మొత్తం మీద రఘురామ టోన్‌ చూస్తుంటే.. ఇప్పట్లో రాజీనామా చేసే ఆలోచన కనిపించడం లేదు. గతంలో తాను సర్వే చేయించుకున్నానని తాను బంపర్ మెజారిటీతో గెలుస్తానని ఆయన సన్నిహితులతో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎందుకో అంత ధైర్యం కనిపించడం లేదు. మరి రాజుగారు రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారా.. లేక.. మొత్తానికే వదిలేసుకున్నారా అన్నది వేచి చూడాలి.


కానీ ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి.. జగన్‌తో చెడిన తర్వాత రాజుగారు  సమరానికి సిద్ధపడిపోయారు.. ఆ ఆ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఎందుకంటే.. జగన్ పరిపాలనపై ఆయన చేసినన్ని విమర్శలు టీడీపీ నేతలు కూడా చేయలేదు. ఆ విషయంలో టీడీపీ నేతలు ఎంపీ రఘురమ కృష్ణం రాజును చూసి నేర్చుకోవాల్సిందే. అంతే కాదు.. కృష్ణం రాజు చేసే ఆరోపణల వెనుక చాలా నిజాలూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: