కాశ్మీర్ ను అమ్మేస్తారు.. పాక్ షాకింగ్ స్టేట్మెంట్?
ఇక ఇప్పుడు కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. యువతకు ఉద్యోగ కల్పన మారుమూల గ్రామాలకు సైతం మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతోంది. ఇక కాశ్మీరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి పాకిస్తాన్ కుల్లుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలోనే కాశ్మీర్ విషయంలో ఎప్పుడూ ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటుంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఇక ఇలాంటి సమయంలో ఇక అటు పాకిస్థాన్ ప్రభుత్వం కాకుండా అక్కడ ఉన్నటువంటి మతోన్మాదులు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.
పాకిస్తాన్లోని జెమియత్ ఉలేమా ఈ ఇస్లామ్ చీఫ్ మౌలానా వర్జుర్ రెహమాన్.. స్టేట్మెంట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. కాశ్మీర్ ప్రాంతం విషయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత్ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని.. కాశ్మీరు భారత్కు అమ్మేశారని.. అందుకే ఇప్పటివరకు కాశ్మీర్ ప్రాంతం గురించి ఇమ్రాన్ ఖాన్ పట్టించుకోవడంలేదని.. ఆ ప్రాంతం కోసం ఏమీ చేయడం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ప్రభుత్వాన్ని నమ్ముకుంటే వచ్చేది ఏమీ లేదని ఇక రానున్న రోజుల్లో మేమే కాశ్మీర్ విషయంలో ముందుకు సాగుతాం అంటూ స్టేట్మెంట్లో పేర్కొనడం సంచలనంగా మారిపోయింది.