మోదీ బడ్జెట్ : హైలెట్స్ ఇవే..! ఎందుకో తెలుసా?
లక్షా నలభై వేల కోట్ల రూపాయలు వచ్చాయి
ఇంత భారీ ఎత్తున పన్ను వసూళ్లు
కరోనాలాంటి సమయాల్లోనూ చూడడమే హైలెట్
వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి రాయితీలు ఇవ్వలేదు కానీ ప్రకృతి వ్యవసాయం చేసేవారిని మాత్రం ప్రోత్సహిస్తామన్నారు .ఇదొక్కటే కాస్త ఊరట! ఎదుకంటే రానున్న కాలంలో ఎరువుల ధరలు భారీగా పెరగనున్నాయి కనుక! అయితే ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహిస్తాం అన్నారే కానీ ఏ విధంగా అన్నది చెప్పలేదు. ఏం చేస్తారో అన్నది మరో వాక్య రూపంలో వివరించలేదు.ఉద్యోగులకు పెద్దగా ఊరట ఇవ్వకపోయినా పన్నుల వడ్డన ప్రస్తుతానికి లేదు. రేపటి వేళ ఉంటుందన్న విషయం మాత్రం స్పష్టంగానే చెప్పారు.అంటే ఏదీ దాయకుండా దగా చేయకుండా నిర్మలా మేడమ్ ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ఈ బడ్జెట్ హైలెట్.
అసలు సాగునీటి ప్రాజెక్టులకు, అదేవిధంగా మిగిలిన కీలకం అనుకునే రంగాలకు పెద్దగా ఏ కేటాయింపులూ లేకుండానే నిర్మలా మేడమ్ తన ప్రసంగాన్ని మమ అనిపించేడయంతో అసలు కథ మొదలయింది.అంతేకాదు మధ్యతరగతి వర్గాలకు సంబంధించి ఎటువంటి ఊరటా లేకపోవడం గమనార్హం. పేద మధ్య తరగతి వర్గాలనే కాదు ఈ బడ్జెట్ సంపన్న వర్గాలకూ ఏ విధంగా కూడా లాభం చేకూర్చకపోవడమే అసలు హైలెట్.
ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగంలో పెద్దగా ఆకట్టుకునే అంశాలేవీ లేవు. ఉచిత పథకాల ప్రకటనలు కూడా లేవు. ఓ విధంగా కేంద్రం నుంచి ఇటువంటి ఆశించడం మంచిదే కానీ ధరల నియంత్రణపై చర్యలు లేకపోవడం పూర్తి నిరాశకు సిసలు కారణం. లోటు ఉందని చెప్పి దేశ ప్రజలకు మనది రుణ భారతం అని తేల్చి చెప్పి వస్తున్న కాలంలో పన్నుల వడ్డన ఖాయం అని ముందస్తు సంకేతాలు ఇచ్చారు.ఇక రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు ఇచ్చేందుకు తాము సిద్ధమని చెప్పారు. ఇందుకు లక్ష కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని అన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద ఎనభై లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. ఇది ఓ విధంగా పేదలకు ఊరట ఇచ్చే విషయం. ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ కోసం రెండేళ్ల పాటు గడువు ఇస్తున్నారు. ఈలోగా తప్పులు దిద్దుకునేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.