గుడ్ న్యూస్ : గడువు పొడిగించిన కేంద్రం?

praveen
రోజు ఆఫీస్ కి ఏం వెళ్తాము గురు.. హాయిగా వర్క్ ఫ్రం హోం ఉంటే ఇంట్లో దర్జాగా కూర్చుని పని చేయొచ్చు.. పెళ్ళాం పిల్లలతో కుటుంబంతో కలిసి  ఎంతో సంతోషంగా ఉండొచ్చు.. అయినా మనకు అలాంటి రోజు వస్తుంది అంటావా.. ఈ కోరిక తీరితే ఎంత బాగుండు అని అప్పట్లో ఐటీ ఉద్యోగులు అందరూ కూడా గట్టిగానే కోరుకున్నట్లు ఉన్నారు. ఇక ఇలా ఉద్యోగుల కోరికను చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ తీర్చేసింది. ఎంత గట్టిగా అంటే ఇక వర్క్ ఫ్రం హోం మా వల్ల కాదు బాబోయ్ అంటూ అందరూ చేతులెత్తేసే విధంగా కరోనా వైరస్ కోరిక తీర్చింది. అంతే కదా మరి.. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ప్రవేట్ సంస్థలన్నీ తమ ఉద్యోగులను ఇంటినుంచే పనిచేసేందుకు వెసులుబాటు కల్పించాయి.


 దీంతో వర్క్ ఫ్రం హోం వచ్చిందని అందరూ ఎంతగానో సంబరపడిపోయారు. ఓ దేవుడా కరుణించవా.. మా కోరిక ఇన్నాళ్లకు తీర్చవా స్వామీ అంటూ మురిసి పోయారు.  కానీ కొన్నాళ్ళకే వర్క్ ఫ్రం హోం పైన విరక్తి వచ్చేసింది అందరికీ. ఆఫీసులు  ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఆశగా చూడటం మొదలుపెట్టాడు. కానీ ఏం చేస్తాం కరోనా వైరస్ మాత్రం  ఎక్కడ తగ్గుముఖం పట్టడంలేదు.. దీంతో దాదాపు రెండేళ్ల నుంచి వర్క్ ఫ్రం హోం కొనసాగుతోంది. కేవలం ప్రైవేటు ఉద్యోగులే కాదు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది.


 ఇక ఇటీవల కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు వచ్చే నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం. సెక్రెటరీ కంటే కిందిస్థాయి ఉద్యోగులకు ఇది వర్తించనుంది అంటూ చెప్పుకొచ్చింది. కాగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్ని ప్రస్తుతం కరోనా వైరస్  నేపథ్యంలో 50 శాతం కెపాసిటీ తో  మాత్రమే నడుస్తున్నాయి. 50 శాతం మంది ఉద్యోగుల్లో గర్భిణీలు దివ్యాంగులు   లాంటి ఉద్యోగులు ఉన్నారు. ఇక వీరు ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం లేదని ఇంటి నుంచి పని చేయవచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wfh

సంబంధిత వార్తలు: