మరోసారి క్షమాపణలు చెప్పిన ప్రధాని.. ఎందుకంటే?
ఇలాంటి సమయంలో ఇక అటు బ్రిటన్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చింది. ఒకప్పుడు మాస్క్ తప్పనిసరి కాదుఅని నిర్ణయం తీసుకున్న బ్రిటన్ ప్రభుత్వం.. మళ్ళీ మాస్కు తప్పని సరి చేయడమే కాదు ఇక ప్రతి ఒక్కరు వైరస్ నిబంధనలు పాటించాలి అంటూ ఆంక్షలు తీసుకువచ్చింది. అంతే కాకుండా ఎలాంటి శుభకార్యాలకు పార్టీలకు కూడా అనుమతించే ప్రసక్తే లేదని ప్రజలు ఎక్కడా గుమిగూడి కూడదు అంటూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆంక్షలు విధించారు. ఇలా ప్రజలందరూ పై ఆంక్షలు విధించిన బ్రిటన్ ప్రధాని ఏకంగా వందల మందితో కలిసి ఒక మద్యం పార్టీని ఏర్పాటు చేయడం సంచలనంగా మారిపోయింది.
కరోనా వైరస్ ఆంక్షలలో మద్యం పార్టీ జరుపుకోకూడదు అని ఉన్న విషయం నాకు తెలియదు అంటూ ఇక బ్రిటన్ ప్రధాని ఇచ్చిన స్టేట్మెంట్ మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు విమర్శలు చేయడంతో గతంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ క్షమాపణలు చెప్పారు. ఇక ఇప్పుడు మరో సారి ఈ విషయంపై స్పందిస్తూ సారీ చెప్పారు బోరిస్ జాన్సన్ తన నివాసంలో కరోనా ఆకాంక్షలను ఉల్లంఘించి సిబ్బందితో కలిసి విందులు జరుపుకున్న విషయం పై నివేదిక అందడంతో.. పార్లమెంటు దిగువ సభలో మరోసారి క్షమాపణలు చెప్పారు ఆయన. తప్పును సరి దిద్దు కుంటానని తమ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలి అంటూ కోరారు.