డబ్ల్యూహెచ్ఓ ఇలా చేసిందేంటి.. జమ్ము కాశ్మీర్ పాకిస్తాన్ లోనట?

praveen
భారత సరిహద్దు లోని కొన్ని ప్రాంతాలు తమ దేశంలో ఉన్నాయి అంటూ ఒకవైపు చైనా  మరోవైపు పాకిస్థాన్ దేశాలు అధికారిక మ్యాప్ లలో చూపిస్తూ వుంటాయి. ఇలా ఇప్పటి వరకు ఎన్నో సార్లు జరిగింది. ఇలా పాకిస్తాన్ చైనా దేశాలు  భారత్లోని కొన్ని భాగాలు తమ అంటూ మ్యాప్ లో చూపించినప్పుడల్లా భారత్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇలాంటి తప్పు చేసి ప్రజల ఆగ్రహానికి గురి అవుతుంది. భారత్ లో ఉన్న కొన్ని భాగాలను పాకిస్తాన్ చైనా లో ఉంటున్నట్లుగా అధికారికంగా మ్యాప్ విడుదల చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.



 ఇది ఈ తెలిసిన భారత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వివక్ష పూరితంగా వ్యవహరిస్తుంది అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇప్పటికే పలుమార్లు భారత్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలా చేయడం గమనార్హం.. ఇక ఇప్పుడు ఇలాంటి తప్పు మరోసారి పునరావృతం కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలా చేస్తోందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారూ కొంతమంది. కోవిడ్ 19 అంతర్జాతీయ వెబ్ సైట్ లో భారత మ్యాప్ ను తప్పు గా చూపించింది  ప్రపంచ ఆరోగ్య సంస్థ.



 జమ్మూ కాశ్మీర్ను భారత్లో ప్రాంతంగా కాకుండా పాకిస్తాన్ చైనాలకు సంబంధించిన ప్రాంతాలుగా మ్యాప్ లో చూపించింది.  పశ్చిమ బెంగాల్కు చెందిన టీఎంసీ ఎంపీ ఈ విషయాన్ని గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాసారు ఆయన. భారత్లోని జమ్ము కాశ్మీర్ ప్రాంతాన్ని డబ్ల్యుహెచ్వో విడుదల చేసిన చిత్రపటంలో పాకిస్తాన్ చైనాల కు చెందినదిగా చూపిస్తున్నారు అంటూ లేఖలో పేర్కొన్నారు ఆయన. జమ్మూ కాశ్మీర్ తో పాటు అరుణాచల్ ప్రదేశ్ ని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ నుంచి విడిగా చూపినట్టు ఆరోపించారు ఆయన. దీన్ని తీవ్రమైన అంతర్జాతీయ సమస్యగా భావిస్తున్నానని కేంద్ర ప్రభుత్వం వెంటనే దీని పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

Who

సంబంధిత వార్తలు: