వామ్మో.. అక్కడ నల్ల మంచు కురుస్తోంది?

praveen
సాధారణంగా శీతాకాలంలో చలి తీవ్రత ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శీతాకాలంలో ఉదయం సమయంలో ఇంటి నుంచి కాలు బయట పెట్టాలి అంటే భయపడిపోతుంటారు జనాలు. అంతేకాదు ఒంటి నిండా ఏదో ఒకటి కప్పుకుంటూ చలి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇక ఒళ్ళు మొత్తం కప్పుకున్నప్పటికీ చలికి వణికి పోతూ ఉంటారు ఇంకెంతో మంది   అయితే చలి కాలంలో కేవలం పొగమంచు రావడం  చలి పెరిగి పోవడం  అన్నది మాత్రమే మనకు తెలుసు. కొన్ని దేశాలలో మాత్రం చలికాలంలో విపరీతమైన మంచు కురుస్తూ ఉంటుంది.


 ఈ క్రమంలోనే అమెరికా రష్యా లాంటి దేశాలలో చాలా మంచు కురవడం చూస్తూ ఉంటాం.  కెనడాలో కూడా శీతాకాలంలో విపరీతంగా మంచు కురుస్తూ ఉంటుంది. అయితే కొంత మంది జనాలు మంచుకురిసి చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం మంచు తో కప్పుకు పోయిన తర్వాత ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం శీతాకాలం ఎప్పుడు ముగిసి పోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారూ.. ఇంతకీ ఇప్పుడు మంచు కురవడం గురించి మ్యాటర్ ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారు కదా. సాధారణంగా మంచు ఏ రంగులో కురుస్తుంది అన్నది అందరికి తెలిసిందే. మంచుకు రంగు ఏంటండీ ఏ దేశానికి వెళ్లిన తెలుపు రంగులోనే ఉంటుంది కదా అని అంటారా..


 అలా అనుకున్నారంటే మీరు పప్పులో కాలేసినట్లే... ఎందుకంటే ఇప్పుడు వరకు తెల్లగా ఉంటే మంచు కురవడం చూశారూ.. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా నల్లరంగు లో మంచు కురుస్తుంది. రష్యాలోని ఓంసూక్చాన్ గ్రామంలో నల్లటి మంచు కురుస్తూ ఉండటం గమనార్హం. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఆ ప్రాంతంలో బొగ్గు తో పనిచేసే వేడినీటి ప్లాంట్ ఉంది. దాని నుంచి వెలువడే దుమ్ము పొగ తో అక్కడ కాలుష్యం ఎక్కువగా పెరిగిపోయింది. దీంతో ఇక్కడ మంచు కింద పడే లోపు నల్ల రంగులోకి మారిపోతుంది. ఇలా నల్ల మంచు కురుస్తూ ఉండడంతో  స్థానికులు అందరూ కూడా భయాందోళనకు గురి అవుతూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: