డైలాగ్ ఆఫ్ ద డే : గమ్మునుండవో!
ఆంధ్రావని ఉద్యోగులు నిరసన బాట పడుతున్నారు.తమకు జీతం చాల్లేదని,కొత్త పీఆర్సీ అస్సలు బాలేదని,అద్దెభత్యం చెల్లింపుల్లో గతం మాదిరి ఉన్న శ్లాబునే కొనసాగించాలని కోరుతున్నారు.ఇవన్నీ న్యాయపరమైన డిమాండ్లా కాదా అన్నది ఇవాళ అంతా ఆలోచించి ఓ అడుగు ముందుకు వేయాలి.ఆర్థిక పరిస్థితి బాలేదని మొదట్నుంచి సీఎం చెబుతూనే ఉన్నారు.అదేవిధంగా తాను పెద్దగా జీతాలు పెంచేది కూడా లేదని విన్నవిస్తూనే ఉన్నారు.అందుకే 11వ వేతన సవరణకు సీఎం జగన్ ఒకంతట మొగ్గు చూపలేదు.కానీ ఉద్యోగ సంఘాలు పట్టుబట్టడంతో చేసేది లేక 23 శాతం ఫిట్మెంట్ ఇస్తూ,డీఏ బకాయిల చెల్లింపునకు సుముఖత చూపుతూ సీఎం జీఓ ఇచ్చారు. కానీ ఇది ఉద్యోగుల అంగీకారానికి అస్సలు నోచుకోవడం లేదు. దీంతో వీరంతా రోడ్డెక్కనున్నారు.
మరి! వీరంతా నిరసన బాట పడితే ఉద్యోగులకు అండగా నిలిచేది ఎవరు? అసలు సమస్య ఇదే! టీడీపీ నేరుగా కార్యాచరణకు రాలేదు.వామపక్షాలు కూడా పెద్దగా బయటకు మాట్లాడడం లేదు.అలాంటప్పుడు వామపక్ష సంబంధ ఉద్యోగ సంఘాలు కొన్ని రోడ్డెక్కి నిరసన చేసినా అవి కూడా ఫలించేలా లేవు.ఇలాంటి నేపథ్యంలో కోర్టుకు పోయి న్యాయ పోరాటం చేయడం మినహా ఉద్యోగులకు మరో ఆప్షన్ లేదు. ఈ దశలో ఉద్యోగులు సైలెంట్ అయిపోవడమే బెటర్.లేదా చర్చల ద్వారా తాము అనుకుంటున్న మరియు కోరుకుంటున్న పాత జీతభత్యాలనే కొనసాగించేలా చేయడం.ఎందుకంటే ఇప్పటికిప్పుడు 30శాతం ఫిట్మెంట్ ఇవ్వడం అన్నది సాధ్యం కాదు కనుక. ఈ తరుణంలో ఉద్యోగుల ప్రతిపాదనలు అప్పుడే ఒడ్డెక్కేలా లేవు.జగన్ కూడా చూసీ చూడని విధంగానే వీరి వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.తాను చెప్పినా కూడా సమ్మెకు వెళ్తే చేసేదేమీ లేదని