క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలోనే మహిళల ఐపీఎల్ ?

Veldandi Saikiran
బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్‌ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  వరల్డ్‌ వైడ్‌ గా ఉన్న క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఐపీఎల్‌ ఎప్పుడుడెప్పుడు జరుగుతుందా ?  అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు.  2007 సంవత్సరంలో...  ప్రారంభమైన ఐపీఎల్‌... ఇప్పటికి ఎంతో విజయవంతంగా కొనసాగుతోంది.  అయితే.. పురుషుల ఐపీఎల్‌ విజయ వంతం కావడంతో..  మహిళల ఐపీఎల్‌ ప్రారంభించాలని..  చాలా రోజుల నుంచి క్రికెట్‌ లవర్స్‌ నుంచి డిమాండ్‌ వస్తుంది.  ఇలాంటి తరుణంలో.. తాజాగా...   మహిళల ఐపీఎల్ను త్వరలోనే ప్రారంభించేందుకు బోర్డు సన్నాహాలు చేస్తుందని తెలిపారు బీసీసీఐ సెక్రటరీ జైషా. కొన్నిరోజుల్లో దీనిపై స్పష్టతనిస్తామని చెప్పారు. 


తాజాగా బీసీసీఐ సెక్రటరీ జైషా  మీడియాతో మాట్లాడుతూ.. "మహిళల టీ20 ఛాలెంజ్ అభిమానుల్లో భారీ ఆసక్తిని నెలకొల్పింది. మహిళల క్రికెట్ను ప్రోత్సాహిస్తున్నారనేందుకు ఇదే నిదర్శనం. వారి కోసం ఐపీఎల్ లాంటి ఓ లీగ్ కావాలి. కేవలం మూడు, నాలుగు జట్ల మధ్య పోటీని నిర్వహించడం మాత్రమే కాదు... మహిళల ఐపీఎల్ లీగ్ను ప్రారంభించడం లాంటిది. ఇందులోకి చాలా అంశాలు వస్తాయి. అంతర్జాతీయ స్టార్లు, బోర్డు సభ్యుల మధ్య ద్వైపాక్షిక కమిట్మెంట్స్ ఇలా చాలా ఉంటాయి. భవిష్యత్ మహిళా క్రికెటర్ల కోసం ఈ లీగ్ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాం. " అని జైషా పేర్కొన్నారు. కాగా... ప్రస్తుతం మహిళల కోసం మూడు జట్లతో టీ20 లీగ్ నిర్వహిస్తుంది బీసీసీఐ. ట్రయల్బ్లేజర్స్, సూపర్నొవాస్, వెలాసిటీ జట్లు ఈ పోటీలో పాల్గొంటాయి. ఆ లీగ్‌ సక్సెస్‌ అయితే.. మహిళల ఐపీఎల్‌ పై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా... గత ఏడాది పురుషుల ఐపీఎల్‌ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా అర్థాంతరంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. మొదటి విడత ఐపీఎల్‌ ఇండియాలో జరుగగా.. సెకండ్‌ విడత దుబాయ్‌ లో జరిగింది. ఇందులో చెన్నై ఛాంపియన్‌ గా నిలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

ipl

సంబంధిత వార్తలు: