వార్నీ.. పెంపుడు కుక్క బర్త్ డే కోసం ఇంత ఖర్చా?
గతంలో ఇలా పెంపుడు జంతువులకు శ్రీమంతం చేసిన వీడియోలు కూడా ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇక్కడ ఒక వ్యక్తి తన పెంపుడు జంతువు పుట్టినరోజును ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేశాడు. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఏడు లక్షల రూపాయలను ఖర్చు పెట్టాడు సదరు వ్యక్తి. అహ్మదాబాద్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అబ్బీ అనే పెట్ డాగ్ ను పెంచుకుంటున్నాడు సదరు వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా లక్షల రూపాయలు ఖర్చుపెట్టి బర్త్ డే సెలబ్రేషన్స్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. అయితే అహ్మదాబాద్లోని నికోల్ అనే యువకుడు తన పెంపుడు కుక్క పుట్టిన రోజు వేడుకల కోసం మధుబన్ గ్రీన్ వద్ద ఒక భారీ ఫ్లాట్ బుక్ చేశాడు. ఆ ప్రాంతంలో అదిరిపోయే డెకరేషన్స్ చేసి కటౌట్ ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో అతిథులను పిలిచి పుట్టినరోజును ఘనంగా జరిపారు.. ఆ పెంపుడు కుక్క ఏకంగా స్కార్ఫ్ ధరించి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక దీని కోసం 520 డ్రోన్ కెమెరా లో అద్దెకు తీసుకున్నాడు సదరు వ్యక్తి.