ఓరినాయనో.. 6 లక్షల కోళ్లు అయిపోయాయ్?

praveen
ప్రస్తుతం ప్రపంచ దేశాలలో కరోనా ప్రభావం వైరస్ ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న దేశం పెద్ద దేశం అనే తేడా లేదు. అన్ని దేశాలలో కూడా ఈ మహమ్మారి పంజా విసురుతోంది. శరవేగంగా పాకిపోతుంది. ఒక దశ కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని సంతోషపడెలోపే  రూపాంతరం చెందుతున్న వైరస్ అంతకు మించిన వేగంతో వ్యాప్తి చెందుతుంది. ఒకవైపు ప్రపంచ ప్రజానీకం మొత్తం వ్యాక్సిన్ వేసుకుని కరోనా వైరస్ పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ వెలుగులోకి వస్తున్న కొత్త వేరియంట్  లు మాత్రం వ్యాక్సిన్ సామర్థ్యాన్ని కూడా ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి అని చెప్పాలి.

 ఇలా ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్న కేసులు మాత్రం ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. మొన్నటి వరకు రెండో దశ కరోనా వైరస్ నుంచి కోలుకున్న ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఊహించని విధంగా కొత్త వేరియంట్ను ఓమిక్రాన్ వెలుగులోకి రావడం చాపకింద నీరులా ప్రపంచదేశాలకు పాకిపోవటం జరుగుతుంది. ఈ క్రమంలోనే అటు ప్రజలు ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఇలాంటి సమయంలోనే మరిన్ని వైరస్ లు కూడా ప్రజల ప్రాణాలు తీయడానికి దూసుకు వస్తున్నాయి అని చెప్పాలి.  అగ్రరాజ్యంగా కొనసాగుతున్న ఫ్రాన్సులో  ఒకవైపు కరోనా వైరస్ భయపడుతూ ఉంటే మరోవైపు బర్డ్ ఫ్లూ  అంత కంతకు భయాందోళనకు గురిచేస్తోంది.

 రోజురోజుకు ఫ్రాన్స్ లో బర్డ్ ఫ్లూ పెరిగిపోతున్న నేపథ్యంలో అక్కడ కోళ్లని ఏకంగా సజీవ దహనం చేస్తున్నారు అధికారులు. ప్రజలందరూ ఎప్పుడు ప్రాణం పోతుందో అనే విధంగా భయపడిపోతూ ఉండటం గమనార్హం. ఇటీవలే బర్డ్ ఫ్లూ భయంతో ఏకంగా ఫ్రాన్స్ లో ఆరు లక్షలకు పైగా కోళ్లని చంపేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా భారీ సంఖ్యలో బాతులను కూడా చంపేసినట్లు తెలుస్తోంది. 2015 తర్వాత మొదటిసారి అత్యధిక కేసులు నమోదు కావడంతో ఇలా ఆరు లక్షలకు పైగా కోళ్ళు బాతులను అక్కడి అధికారులు చంపేశారట. ఇలా ప్రస్తుతం ఫ్రాన్స్ లో బర్డ్ ఫ్లూ వైరస్ అందరిని భయాందోళనకు గురిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: