చైనాకి అతి పెద్ద సంక్షోభం.. చేసిన పాపం ఎటు పోతుంది?
చైనా సృష్టించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో వ్యాపిస్తూ రూపాంతరం చెందుతూ వచ్చింది. గతంలో రెండవ దశలో డెల్టా వేరియంట్ బ్రిటన్లో వెలుగులోకి వచ్చింది. ఇక ఇప్పుడు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ సౌత్ ఆఫ్రికా లో వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఓమిక్రాన్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది అనే చెప్పాలి. అదే సమయంలో కొత్త వేరియంట్ చైనాలో కూడా భయపెడుతోంది.అయితే ఇక వైరస్ ను కంట్రోల్ చేయడంలో చిన్నపాముకు పెద్ద కర్ర అనే నానుడిని ఫాలో అవుతుంది చైనా. తక్కువ కేసులు వెలుగులోకి వచ్చిన ప్రాంతాలలో కూడా లాక్ డౌన్ విధిస్తూ ఉండడం గమనార్హం.
మొన్నటి వరకు చైనాలోని షియాంగ్ లో ఎనిమిది వందల కేసులు వెలుగులోకి రావడంతో 11 కోట్ల జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో కఠినమైన లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది చైనా ప్రభుత్వం. దాదాపు పది రోజుల నుంచి కూడా ఆ ప్రాంతం మొత్తం లాక్ డౌన్ లోనే ఉంది. ఇక ఇప్పుడు ఎలాన్ ప్రాంతంలో లాక్ డౌన్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది చైనా ప్రభుత్వం. ఇప్పటివరకు ఓమిక్రాన్ భయంతో 11,500 విమాన సర్వీసులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారీ వరదలు, రియల్ రంగం సంక్షోభం, కరెంట్ సంక్షోభం కారణంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన చైనా ఇక ఇప్పుడు వరుస లాక్ డౌన్ లతో మరింత పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది అని అంటున్నారు విశ్లేషకులు.