ఇండియాలో ఒమిక్రాన్ అరాచకమే.. బ్రిటన్ సైంటిస్ట్ వార్నింగ్?
అయితే.. ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ అరాచకం చేయబోతోందట. ఇండియాలో దేశంలో ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్న సమయంలో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త దీనిపై చేసిన ఓ విశ్లేషణ హడలెత్తిస్తోంది. ప్రొఫెసర్ పాల్ కొట్టుమాన్ అనే ఈ శాస్త్రవేత్త ఏమంటున్నారంటే.. భారత్‌లో రోజుల వ్యవధిలోనే కరోనా కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందట. భారీ జనాభా ఉన్న భారత్‌లో ఈ అరాచకపు ఒమిక్రాన్ వేరియంట్ మరింత వేగంగా విస్తరించే ప్రమాదం ఉందట.
అంతే కాదు.. ఈ వారంలోనే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇండియాలో విజృంభించే అవకాశం లేకపోలేదని సదరు సైంటిస్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. భారత్‌లో కరోనా వ్యాప్తిని అంచనా వేసే కొవిడ్ ట్రాకర్‌ను ఈ ప్రొఫెసర్ పాల్ కొట్టుమాన్ పరిశోధకులు బృందం తయారు చేసింది. ఈ బృందం ఇంకొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపెట్టింది. ఇప్పటికే భారత్‌లోని ఆరు రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని ఈ సైంటిస్టులు టీమ్ చెబుతోంది. 3
డిసెంబర్ 26 నాటికి వైరస్ ముప్పు ఉన్న రాష్ట్రాల సంఖ్య 11 చేరిందంటన్న ఈ బృందం.. కొన్ని రోజుల వ్యవధిలోనే భారత్‌లో కరోనా కేసులు వేగంగా పెరుగుతాయని అంచనా వేసింది. తాము రూపొందించిన కోవిడ్ ట్రాకర్ ద్వారా ఈ విషయాన్ని నిపుణులు అంచనా వేశారు. ఈ విషయంలో చాలా వరకూ వాస్తవం ఉండొచ్చు. ఇక ఇక్కడ ఊరట కలిగించే విషయం ఏంటంటే.. ఈ ఒమిక్రాన్ కారణంగా ఆస్పత్రుల పాలయ్యే వారి సంఖ్య ఇప్పటి వరకూ అయితే తక్కువగానే ఉంది.