అయ్య బాబోయ్.. పెట్రోల్,డీజిల్ హోమ్ డెలివరీ.. ఎక్కడో కాదు?
ఇక ఇటీవల కాలంలో కిరాణా సరుకుల తో పాటు కూరగాయలు కూడా హోం డెలివరీ అవుతూ ఉండటం గమనార్హం. దీంతో వీటి కోసం కూడా జనాలు బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇక ఇప్పటికే బ్యాంకు లావాదేవీలు అన్ని ఆన్లైన్ లోనే జరుగుతున్నాయి అనే విషయం తెలిసిందే. ఇక మద్యం కూడా ఆన్లైన్లో బుక్ చేస్తే హోమ్ డెలివరీ చేస్తూ ఉండటం గమనార్హం. కానీ పెట్రోల్ కోసం మాత్రం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పెట్రోల్ బంకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సామాన్యుడి దగ్గర నుంచి ధనవంతుడు వరకు ప్రతి ఒక్కరు పెట్రోల్ బంకు వెళ్ళి పెట్రోల్ పోసుకోవాల్సిందే. ఈ క్రమంలోనే పెట్రోల్ కూడా ఆన్లైన్ డెలివరీ వస్తే ఎంత బాగుండు అని ఎంతో మంది కోరుకున్నారు.
ఇక ఇప్పుడు ఇది నిజమే అయినట్లు తెలుస్తోంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బిపిసిఎల్ యాప్ ద్వారా ఎవరైనా పెట్రోల్ బుక్ చేసుకుంటే వారికి పెట్రోల్, డీజిల్ హోమ్ డెలివరీ చేస్తాము అంటూ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ తెలిపింది. ఎవరు కూడా పెట్రోల్ బంకు రావాల్సిన అవసరం లేదు అంటూ చెప్పింది. ప్రస్తుతానికి విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని బీపీసీఎల్ సౌత్ డి జి యం రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫెసో క్యాన్ తోనే ఇంధనాన్ని సరఫరా చేస్తామని.. తద్వారా ఇలాంటి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉండదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.