తాలిబన్ల కొత్త కోణం.. దానికి ఓకే.. కానీ?

praveen
ఆయుధాలను చేతపట్టి ఆఫ్ఘనిస్తాన్లో ఆధిపత్యాన్ని చేపట్టిన తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సాగిస్తున్న పాలన ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. తాము మంచి వాళ్ళం మారిపోయాము అంటూ ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చిన తాలిబన్లు ఆ తర్వాత మాత్రం అసలు రంగు బయట పెడుతున్నారు. ఆఫ్ఘనిస్థాన్లో  ఉన్న ప్రజలందరినీ కూడా బానిసలుగా చూస్తూ దారుణం గా వ్యవహరిస్తున్నారు. షేరియా చట్టాలను అమలు లోకి తీసుకు వస్తూ చిన్న నేరాలకు పెద్ద శిక్షలు విధిస్తూ ప్రజలందరినీ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల విషయం లో తాలిబన్లు వ్యవహరిస్తున్న తీరు మరింత హాట్ టాపిక్ గా మారి పోతుంది అని చెప్పాలి.

 మహిళను మనుషులుగా కాదు కేవలం సెక్స్ బొమ్మలుగా మాత్రమే చూస్తున్నారు.  కనీస హక్కులు లేకుండా ఎన్నో కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తున్నారు. ఇప్పటికే మహిళలు ఉద్యోగాలు చేయకూడదు ఆంక్షలు విధించారు. ప్రభుత్వ ఆంక్షలతో ఇప్పటికే ఎంతోమంది మహిళలు ఉద్యోగాలు కోల్పోయి ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే సమయం లో మహిళలు చదువుకోవడానికి కూడా వీలు లేదు అంటూ ఆంక్షలు విధించారు తాలిబన్లు. అయితే మహిళలపై వివక్ష నేపథ్యంలో అటు తాలిబన్ల తీరుపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తోంది.

 ఇలాంటి పరిస్థితుల నేపథ్యం లో అటు తాలిబన్లు కాస్త వెనక్కి తగ్గి మహిళల చదువు విషయం లో కొత్త రూల్స్ తెరమీదకు తీసుకువచ్చారు.  ఆడ పిల్లలు చదువుకోవడానికి అంగీకరిస్తాం కానీ అబ్బాయితో కలిసి చదువుకోడానికి మాత్రం అస్సలు అంగీకరించబోమని అంటూ తాలిబన్లు సరికొత్త రూల్స్ తెరమీదకు తీసుకువచ్చారు..  ఆడ మగ కలిసి చదువు కోవడం ఇస్లామిక్ కు వ్యతిరేకం అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది  తాలిబన్ల ప్రభుత్వం. అందుకే తమ దేశంలో కో-ఎడ్యుకేషన్ అనుమతించబోమని కానీ మహిళలు ప్రత్యేకమైన పాఠశాలలు కళాశాలలో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తామని తాలిబన్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: