స్ట్రాంగ్ వార్నింగ్.. తగ్గేదేలే అంటున్న పుతిన్?

praveen
ఒకప్పుడు యూరోపియన్ యూనియన్లో సభ్యదేశంగా కొనసాగింది రష్యా. కానీ ఆ తర్వాత మాత్రం యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి వచ్చి ప్రస్తుతం స్వతంత్ర దేశంగానే కొనసాగుతోంది. అయితే స్వతంత్రదేశంగా కొనసాగుతున్న రష్యా గత కొంతకాలం నుంచి చైనా బాటలో ముందుకు సాగుతూ ఉండటం గమనార్హం. సరిహద్దుల్లో ఉన్న చిన్న చిన్న పొరుగు దేశాలను తమ దేశంలో కలుపుకోవడానికి చైనా ఎన్నో కుట్రలు పన్నుతూ ఉంటుంది. ఇక అచ్చం ఇలాగే చైనా మిత్ర దేశమైన రష్యా కూడా పొరుగున వున్న ఉక్రెయిన్ దేశాన్ని తమ దేశంలో కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.


 అయితే ఉక్రెయిన్ దేశం పై అటు ఆధిపత్యం సాధించడం కోసం రష్యా చేస్తున్న పనులను యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు తీవ్రం గా వ్యతిరేకిస్తూ ఉండటం గమనార్హం. అగ్ర రాజ్యమైన అమెరికా అటు రష్యా తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్ దేశం విషయానికి వస్తే ఏకంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఉక్రెయిన్ దేశం యూరోపియన్ యూనియన్లో చేరకూడదు అనే పట్టుదలతోనే ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు ముందుకు సాగుతున్నారు.



 ఇకపోతే ఇటీవలే మరో సారి న్యూక్లియర్ హెచ్చరికలను జారీ చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్. మరోవైపు రష్యా చర్యలను వ్యతిరేకిస్తూ అటు జర్మనీ సైతం  తీవ్రమైన హెచ్చరికలను జారీ చేసిన నేపథ్యంలో అటు జర్మనీకి కూడా ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఘాటైన సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో పతిన్ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేడు అన్నది ప్రస్తుతం అంతర్జాతీయ మీడియా లో వినిపిస్తున్న మాట. ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా ఉంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కానీ  యూరోపియన్ యూనియన్ లో చేరితేనే తమకు అభ్యంతరం ఉంది అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ చెబుతుండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: