శభాష్ సజ్జనార్.. పదవి మారినా అదే దూకుడు?

praveen
సజ్జనార్  తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు. సాధారణంగా సజ్జనార్ పోలీస్ కమిషనర్గా పనిచేసిన సమయంలో ఎంతో దూకుడుగా పనిచేశారు. నేరాలు నియంత్రించడంలో తనదైన శైలిలో ముందుకు సాగారు. సజ్జనార్ పేరు చెబితే చాలు నేరస్థుల వెన్నులో వణుకు పుట్టె విధంగా వ్యవరించారు.  దిశ అత్యాచారం హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసిన సమయంలో సీపీ సజ్జనార్ మరోసారి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా కూడా గుర్తింపు సంపాదించారు.



 ఇక ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం సజ్జనార్ను తెలంగాణ ఆర్టీసీ ఎండీ గా నియమించింది. దీంతోసీపీ సజ్జనార్ దూకుడు తగ్గుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎదో సినిమాలో  డైలాగ్ చెప్పినట్లు.. ఎనీ టైం.. ఎని ప్లేస్.. ఎనీ సెంటర్ ఏ పదవిలో ఉన్నా కూడా పదవికి ఆభరణంగా మారిపోతున్నారు సీపీ సజ్జనార్.  దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఆర్టీసీ ఎండీగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సజ్జనార్ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారిపోతున్నాయ్. టిఎస్ఆర్టిసి సంస్థను ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా ఓకే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.



 ఆర్టీసీ ఎండీగా తనకున్న అన్నీ అధికారులను కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు మరో వినూత్న మైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి శభాష్ అనిపించుకున్నారు. ఇప్పటికే ఆర్టీసీ బస్టాండ్లలో దోపిడీలు నియంత్రణకు చేపట్టిన సజ్జనార్.. అప్పుడప్పుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తు ప్రయాణికుల అవసరాలను ఇబ్బందులను తెలుసుకుంటున్నారు.  పుస్తక ప్రియుల కోసం టిఎస్ఆర్టిసి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని ఎన్టీఆర్ మైదానంలో జరుగుతున్నటువంటి జాతీయ పుస్తక ప్రదర్శనను ఎంతోమంది సందర్శించడానికి వీలుగా సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు . ప్రయాణికులు తీసుకునే 24 గంటల వంద రూపాయల టికెట్ పై ఇక ఇరవై రూపాయల రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 27వ తేదీవరకు ఇది కొనసాగుతుంది అంటూ తెలిపారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతో అద్భుతం అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Cp.

సంబంధిత వార్తలు: