ఇంకెన్ని కావాలి.. ఫ్రాన్స్ ఆఫర్.. మోదీ ఏమంటారో?

praveen
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రక్షణ రంగాన్ని మరింత పటిష్టవంతంగా మార్చేందుకు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యాలతో దౌత్యపరంగా ఎంతో బలమైన సంబంధం ఏర్పరచుకుంటు వస్తుంది భారత్. ఇలా ఫ్రాన్స్ తో బలమైన వాణిజ్యపరమైన సంబంధాలను ఏర్పరుచుకుంది అనే చెప్పాలి. ఈ క్రమంలోనే భారత వాయుసేన ను ఎంతో పటిష్టవంతంగా మార్చేందుకు ఎన్నో యుద్ధ విమానాలను కొనుగోలు చేయడంతో పాటు ఇతర ఆయుధాలను కూడా కొనుగోలు చేసింది.


 ఇలా భారత వాయుసేనను ఎంతో పటిష్టంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం రాఫెల్ విమానాల కొనుగోలు. అయితే సాధారణంగా ఫ్రాన్స్ వినియోగించిన రాఫెల్ యుద్ధ విమానాలు కాకుండా మరింత అధునాతన టెక్నాలజీతో ప్రత్యేకంగా తయారు చేయబడిన రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేసింది. కాగా రాఫెల్  యుద్ధవిమానాల రాకతో అటు భారత వాయుసేన మరింత పటిష్టవంతంగా మారిపోయింది అనే చెప్పాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఎంతో సమర్థవంతంగా ఖచ్చితమైన లక్ష్యంతో దాడి చేయగల సామర్థ్యాన్ని రాఫెల్ యుద్ధ విమానాలు కలిగి ఉంటాయి అని రక్షణ రంగ నిపుణులు అంచనా వేశారు.



 అయితే మొత్తంగా 36 రాఫెల్ యుద్ధ విమానాలు కావాలి అంటూ ఫ్రాన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది భారత్. ఇక ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటివరకు 34 రాఫెల్ యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో వచ్చి చేరాయి. మరో రెండు రఫేల్ యుద్ధ విమానాలు మాత్రమే రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల ఫ్రాన్స్ విదేశాంగ శాఖ మంత్రి భారత్ వచ్చి చర్చలు జరపడం ఆసక్తికరంగా మారిపోయింది. ఇంకా ఎన్ని రఫెల్ యుద్ధ విమానాలు కావాలి అంటూ అటు భారత ప్రభుత్వాన్ని అడిగినట్లు తెలుస్తోంది. రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన ఫ్రాన్స్ ఆఫర్ ఇవ్వగా  అటు దీనిపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: