మోదీ అద్భుతం.. 17 సొరంగాలతో రైల్వే లైన్?
ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుండి ఈశాన్య రాష్ట్రాలలో అన్ని రకాల వసతులు కల్పించేందుకు సిద్ధమయింది కేంద్ర ప్రభుత్వం. అభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తుంది అనే చెప్పాలి . ఇక ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలలో అభివృద్ధి శరవేగంగా చేపట్టడమే కాదు ఇక అన్నిప్రాంతాల నుండి రోడ్డు మార్గం రైలు మార్గం కూడా వేస్తూ మౌలిక వసతులను కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం.. అంతేకాదు ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న ప్రముఖ ఆలయాలకు కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ ఆలయాల అభివృద్ధికి కూడా భారీగా నిధులు ఖర్చు పెడుతుంది.
ఇప్పుడు వరకు ఈశాన్య రాష్ట్రాలను లింక్ చేస్తూ భారీ ఎత్తున రెండు లైన్ల హైవేలను వేసుకుంటూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంతే కాకుండా ఒకవేళ యుద్ధ సమయంలో యుద్ధ విమానాలు ఎంతో సులభంగా దిగేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. అంతేకాకుండా ఈశాన్య రాష్ట్రాల నుంచి కాశ్మీర్కు సొరంగ మార్గాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇప్పుడు రిషికేశ్ కర్నాప్రాయాగ్ అనే కొత్త రైల్వే మార్గాన్ని కూడా ప్రారంభించింది. అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించి 17 సొరంగాలతో ఈ రైల్వే మార్గాన్ని నిర్మించబోతున్నారు. భారత రైల్వే చరిత్రలో ఇది ఒక అద్భుతం అని చెప్పవచ్చు.