నవ్వదు, తాగొద్దు, ఏడవద్దు.. నియంత కిమ్ కొత్త రూల్స్?

praveen
ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నియంత పాలన సాగించేది ఎవరు అంటే అందరు టక్కున చెప్పే పేరు కిమ్ జాంగ్ ఉన్. ప్రస్తుతం ఉత్తర కొరియా అధినేతగా కొనసాగుతున్న కిమ్ జాంగ్ ఉన్ పెట్టె నియంత రూల్స్ ఎప్పుడు ప్రపంచ దేశాలను విస్తుపోయేలా చేస్తూ ఉంటాయి. దేశ ప్రజలందరికీ బానిసగా చూస్తూ నియంత పాలన తో తాను చెప్పిందే వేదంగా ప్రస్తుతం పాలన సాగిస్తున్నాడు. ఇప్పటికే కిమ్ జాంగ్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలను ఎన్నోసార్లు ఆశ్చర్యపరిచాయి. ఇక ఇప్పుడు మరో సారి ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తీసుకున్న నిర్ణయం సంచలన గా మారిపోయింది. కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ మరణించి 10 ఏళ్ళు పూర్తి కావడంతో ఇక ఆయన సంస్మరణార్థం 11 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది ప్రభుత్వం..

 ఈ సందర్భంగా వెలుగులోకి తీసుకొచ్చిన ఆంక్షలు మాత్రం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 11 రోజుల పాటు దేశంలో ప్రజలెవరూ నవ్వడానికి వీలు లేదు. అంతేకాకుండా మద్యం తాగడానికి కూడా అనుమతి లేదు. ఇక వేడుకలు లాంటివి అస్సలు చేయకూడదు అంటూ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చారు. ఇక ఈ నియమాల గురించి చెబుతూ అక్కడి మీడియా లో ఇప్పటికే ప్రకటనలు కూడా జారీ అయినట్లు తెలుస్తోంది. సంతాపదినాలు సమయంలో మనం మద్యం సేవించకూడదు.. నవ్వకూడదు.. వేడుకల్లో పాల్గొనకూడదు అంటూ రేడియో ఫ్రీ ఆసియా ప్రభుత్వ ఆదేశాలను ప్రజలందరికీ తెలియ చేయడం గమనార్హం.

 వామ్మో ఇలాంటి రూల్స్ అయితే ఇక ప్రజలు భరించడం ఎలా అని అనుకుంటున్నారా.. అప్పుడే అయిపోలేదు ఇంకా చాలా ఉంది.. డిసెంబర్ 17వ తేదీన దేశ వ్యాప్తంగా ప్రజలు ఎవరూ కూడా నిత్యావసరాలకు దుకాణాలకు వెళ్లకూడదనే నిబంధన కూడా పెట్టాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్. ఇలా ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోయిన కూడా బిగ్గరగా ఏడవడానికి వీలులేకుండా పుట్టినరోజులు జరుపుకోవటానికి వీలు లేకుండా కొత్త ఉత్తర్వులు అమల్లోకి తీసుకువచ్చారు. గతంలో సంతాప దినం ప్రకటించిన సమయంలో కొంతమంది మద్యం తాగుతూ పట్టుబడటంతో వారికి శిక్ష వేశారు.ఆ తర్వాత వారు అసలు కనిపించకుండా పోయారు.. కిమ్ జాంగ్ ఉన్ తండ్రి 2011 డిసెంబర్ 17వ తేదీన గుండెపోటుతో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kim

సంబంధిత వార్తలు: