కెసిఆర్ గారు.. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి: షర్మిల
ఇకపోతే ఇటీవల వరి వేసే రైతులకు ప్రభుత్వం వరుసగా షాక్ ఇస్తూనే వస్తుంది. వరి కొనుగోలు చేసే ప్రసక్తి లేదు అంటూ అటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అనే విషయం తెలిసిందే. దీంతో ఇక వరి పండే భూమిపై ఏం పండించాలో తెలియక ప్రస్తుతం రైతులందరూ ఆందోళనలు మిగిలిపోతున్నారు. గతంలో వడ్లను కూడా ప్రభుత్వం ఇంకా కొనలేదు. దీంతో మనస్థాపంతో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రివైయస్ షర్మిల.
ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ నే ఉన్నారు వైయస్ షర్మిల.ఇక ఇటీవల మరోసారి రైతుల ఆత్మహత్యల పై స్పందించిన వైఎస్ షర్మిల కేసీఆర్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు తెలంగాణను రైతు చావుల తెలంగాణ గా మార్చారు అంటూ వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రభుత్వం చెప్పినట్లు వరి కాకుండా వానాకాలంలో మిర్చి పత్తి పంటలు వేసిన రైతులు నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎంత మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే కెసిఆర్ దాహం తీరుతుందో సమాధానం చెప్పాలి అండి డిమాండ్ చేశారు వైయస్ షర్మిల.