అమెరికా యాక్షన్ షురూ.. తగ్గేదేలే అంటున్న బైడెన్?
కరోనా వైరస్ మరణాలు కూడా అమెరికాలోనే ఎక్కువ గా వెలుగులోకి వచ్చాయి అని చెప్పాలి. ఇలా రెండు దశల కరోనా వైరస్ తో అల్లాడిపోయిన అమెరికా ఇప్పుడు మాత్రం మూడవదశ వైరస్ విషయంలో మాత్రం ఎంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఇటీవల సౌత్ ఆఫ్రికా లో వెలుగులోకి వచ్చిన కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచదేశాలను భయపెడుతుంది. రెండవ దశలో వ్యాప్తిచెందిన డెల్టా కంటే ఈ కొత్త వేరియంట్ ఎంతో ప్రమాదకారి అంటూ అటు ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నాయి.
ఈ క్రమంలోనే అగ్రరాజ్యమైన అమెరికా మళ్లీ కొత్త ఆంక్షలను అమలులోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇటలీ, గ్రీన్ ల్యాండ్ మార్షస్ లాంటి దేశాలకు అమెరికా పౌరులు వెళ్ళకూడదు అంటూ ఆంక్షలు విధించింది. అయితే ఏ ప్రాంతాలకు వెళ్లే ఏ ప్రాంతాలకు వెళ్ళకూడదు అన్న విషయాలను కూడా ఎంతోస్పష్టంగా వివరించింది అమెరికా ప్రభుత్వం. ఇలా అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన కొత్త నిబంధనల ప్రకారం మూడు దేశాలు వెళ్లడానికి మాత్రం పూర్తిగా నిషేధం విధించింది. అయితే అటు ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని దేశాలు కూడా కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తున్నాయి. కాగా ఇటీవలే కొత్త వేరియంట్ ఓమిక్రాన్ మొదటి మరణం సంభవించడం ప్రపంచాన్ని మరింత భయాందోళనకు గురి చేసింది.