చైనా మరో కుట్ర.. ఈసారి మరింత తెగించింది?

praveen
ఇప్పటికే సరిహద్దుల్లో ఉన్న పెద్ద దేశాలతో వివాదాలు పెట్టుకొని వెనక్కి తగ్గిన చైనా.. పొరుగున ఉన్న చిన్న దేశాల విషయంలో  మాత్రం ఎంతో దారుణంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే హాంకాంగ్  లాంటి ఎన్నో స్వతంత్ర దేశాల ను చైనాలో కలుపుకుంది. ఇక ఇప్పుడు చైనా పొరుగు దేశంగా ఉన్న తైవాన్ ను తమ దేశంలో కలుపుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇలా చైనా చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా గత కొన్ని రోజుల నుంచి ఎంతో హాట్ టాపిక్  గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే.


అయితే తైవాన్ ను ఆక్రమించుకుంటే ఊరుకునేది లేదు అంటూ అగ్రరాజ్యమైన అమెరికా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ చైనా తీరులో మాత్రం ఎక్కడా మార్పు రావడంలేదు.ఇక ఇప్పటికే తైవాన్ సరిహద్దుల్లో భారీగా యుద్ధ విన్యాసాలు కూడా చేస్తుంది చైనా. ఇప్పటికే పలుమార్లు చైనా యుద్ధ విమానాలతో తైవాన్ గగనతలంలో కి వెళ్లి దాష్టీకానికి  విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఇలాంటి దాష్టీకానికి పాల్పడింది. ఇటీవలే ఆఫ్రికన్ దేశమైన నికర్ గోవా తైవాన్ తో దౌత్యపరమైన సంబంధాలను తెంచుకుంది.


 అయితే ఇలా ఆఫ్రికన్ దేశం దౌత్య సంబంధాలను తెంచుకోవడానికి వెనకుండి నడిపించింది చైనానే అని చెప్పాలి. ఇక ఇదే రోజున అటు చైనా యుద్ధ విమానాలను మరోసారి తైవాన్ గగనతలంలో కి పంపించింది చైనా . ఇలా ఏకంగా పదికిపైగా యుద్ధ విమానాలను తైవాన్ గగనతలంలో కి పంపించింది.  అయితే తైవాన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఏకంగా యుద్ధ విమానాలతో వెంట పడటంతో చైనా యుద్ధ విమానాలు మళ్ళీ వెనక్కి పరుగులు పెట్టాయట. ఇలా గత వారం రోజుల వ్యవధిలో 150కిపైగా యుద్ధ విమానాలు తైవాన్ గగనతలంలో పంపి దాష్టీకానికి పాల్పడుతుంది చైనా. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: