కాంక్రీట్ మిక్సర్ తో భోజనం.. లొట్టలేసుకుంటూ తిన్న జనం?
అయితే 1000 మంది రెండు వేల మందికి అయితే ఇలా చేస్తూ ఉంటారు. అదే రెండు లక్షల మందికి అన్నదాన కార్యక్రమం అంటే ఇక ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల సంఖ్యలో వంటపాత్రలు తీసుకువచ్చి వంటకాలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం కాస్త డిఫరెంట్ గా ట్రై చేశారు. సాధారణంగా వంట కాలకు వాడే పాత్రల్లో వండితే లేటవుతుంది అనుకున్నారో ఏమో భవనాలు కట్టడానికి వాడే కాంక్రీట్ మిక్సింగ్ మిషన్ వంటకం కోసం వాడారు. ఇక ఈ మిషన్ లో ఒక స్వీట్ తయారు చేసి ఏకంగా 2 లక్షల మందికి పెట్టగా ఆ స్వీట్ ని లొట్టలేసుకుంటూ తిన్నారు అందరు.
మధ్యప్రదేశ్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మేరేనా జిల్లా చంబల్ ప్రాంతంలోని మౌని బాబా ఆశ్రమం లో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భగవద్గీత కథ చివరి రోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రెండు లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. ఇక విచ్చేసిన భక్తులందరికీ పెద్ద మొత్తంలో త్వరగా ఆహారం తయారు చేయడం ఎలా అని ఆలోచించగా.. ఒక ఆలోచన తట్టింది. దీనికోసం ఏకంగా ఒక కాంక్రీట్ మిక్సర్ యంత్రాన్ని ఉపయోగించారు.. మల్పువ్వా అనే పిండిని కాంక్రీట్ మిక్సర్ లో కలిపారు. ఇక 15 ట్రాలీ ల సహాయంతో భోజనం సరఫరా చేశారు . దాదాపు 100 గ్రామాల్లో నుంచి వచ్చిన భక్తులు అన్నదాన కార్యక్రమం లో వచ్చి భోజనం చేశారు. ఇక ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు కూడా అన్నదాన కార్యక్రమం జరిగింది.