హెలికాప్టర్ ప్రమాదం.. చైనాకు కుట్రేనా?
ఇటీవలే తమిళనాడు లోని నీలగిరి హిల్స్ లో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ సహా మరికొంతమంది ఆర్మీ అధికారులు దుర్మరణం పాలయ్యారు. భారత ఆర్మీ ని ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు నడిపిస్తున్న త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి భారత ప్రజానీకాని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇకపోతే అచ్చంగా ఇలాగే తైవాన్ లో లత్రివిధ దళాధిపతి గా కొనసాగుతున్న వ్యక్తి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇలా ఒకప్పుడు తైవాన్లో జరిగిన ప్రమాదానికి ఇటీవలే భారత్ లో జరిగిన ప్రమాదానికి కొంచెం పోలికలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇక చైనా బద్ద శత్రువులు గా కొనసాగుతున్న భారత్ తైవాన్ లలో జరిగిన ఈ రెండు ఘటనలను చైనా కుట్ర వల్లే జరిగాయన్న అనుమానాలు కూడా ప్రస్తుతం తెర మీదకు వస్తున్నాయి. ప్రస్తుతం భారత రక్షణ రంగాన్ని తనదైన ఆ వ్యూహాలతో ముందుకు నడిపిస్తూ శత్రు దేశాలకు వణుకు పుట్టించే విధంగానే ముందుకు సాగుతున్నారు బిపిన్ రావత్. ఇక అలాంటి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవ్వటం వెనుక ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. ఇక ఇప్పుడు కొత్తగా చైనా పై అనుమానాలు కూడా వెలుగులోకి వస్తూనే ఉన్నాయ్. మరి అసలు నిజం ఏంటనేది మాత్రం విచారణలో తేలనుంది.