రావత్ మరణంపై పోస్ట్ పెట్టి.. అరెస్ట్ అయ్యాడు?
అంతే కాదు సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు కూడా బిపిన్ రావత్ మృతి పై స్పందిస్తూ సంతాపం తెలియజేశారు. భారత రక్షణ రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బిపిన్ రావత్ భారత ఆర్మీ లో ఇలాంటి సేవలు చేశారు. త్రివిధ దళాధిపతి గా ఇతర దేశాలతో సైనిక సంబంధాలను ఎలా మెరుగుపరచుకున్నారు అన్న విషయాలను ప్రస్తావిస్తూ ఎన్నో వార్తలు వైరల్ గా మారిపోయాయి. అయితే ఇటీవల ఒక వ్యక్తి బిపిన్ రావత్ మరణంపై పోస్టులు పెట్టి ఏకంగా జైలు పాలయ్యాడు.
త్రివిధ దళాధిపతి గా ఉన్న బిపిన్ రావత్ మరణంపై భారత ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ శోకసంద్రంలో మునిగిపోయారు. ఇలాంటి సమయంలో గుజరాత్లోని అమ్రేలి కి చెందిన శివ బాయి అహిర్ మాత్రం ఫేస్బుక్లో అభ్యంతరకర పోస్టు పెట్టాడు. హెలికాప్టర్ దుర్ఘటనలో అమరులను కించపరిచే విధంగా పరుషపదజాలం వాడుతూ ఫేస్బుక్లో తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఇక ఈ విషయం కాస్త సైబర్క్రైమ్ పోలీసుల దృష్టికి వెళ్ళింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే గతంలో ఇతను ప్రధానమంత్రిని కూడా కించపరిచే విధంగా పోస్టులు పెట్టి అరెస్టు కావడం గమనార్హం.