ఫ్యాన్ ఆంధ్రా : పుష్పాభిషేకం ఎందుకు సామీ?
ఉద్యోగులకూ జగన్ కూ మధ్య వార్ నడుస్తోంది
తప్పేం కాదు డీఏలు పెండింగ్ ఉండిపోయాయి
అని అడగడం కూడా తప్పు కాదు కానీ
ఒక డీఏ కోసం ఒక అలవెన్స్ కోసం ఎరియర్ కోసం
ఇలా ఉద్యోగులు మరీ దిగజారి మాట్లాడడం
వారి స్థాయి కి తగని పని బండి శ్రీను ఆలోచించవయ్యా!
పాలాభిషేకాన్ని పుష్పాభిషేకాన్ని కానీ అభిమానం చాటుకోవడంలోనే చేస్తారు. వాస్తవానికి ఉద్యోగ సంఘాలు ఏవయినా ప్రభుత్వాలకు అనుబంధంగానే ఉంటాయి. అదేం తప్పు కాదు కానీ మరీ! ఇలాంటి అభిషేకాల పేరిట ప్రకటనలు ఎందుకు అని నవ్వుకుంటున్నాను నేను. కొత్త వేతన సవరణ ఇస్తే తమ జీవితం బాగు పడుతుందని ఉద్యోగులు చెప్పడం పెద్ద హాస్యాస్పద విషయం. ఎందుకంటే అంతకన్నా తక్కువ జీతాలకు ఇంకా చెప్పాలంటే నెలకు ఎనిమిది వేల జీతాలకు కూడా నోచుకోని కాంట్రాక్టు ఉద్యోగులు ఎన్నో అవస్థలు పడి పనిభారం మోస్తున్న సంగతి మరిచిపోయి మాట్లాడడం సర్కారు ఉద్యోగులకు తగదు. కానీ జగన్ ను నమ్మి తాము ఓటేశామని చెప్పడం, సీపీఎస్ రద్దు చేయలేదని అరవడం ఇవన్నీ కూడా అవసరార్థ రాజకీయాలే. ఇవేవీ నెగ్గవు కానీ జగన్ అనుకుంటేనే కొత్త వేతన సవరణ సాధ్యం లేదంటే లేదు.
కొత్త వేతన సవరణ అన్నది అతి ముఖ్యమయిన విషయం అని ఉద్యోగ సంఘాలు ఉద్యమ సంఘటనలు చాటి చెబుతున్నాయి. ఆంధ్రావనిలో ఇప్పటికిప్పుడు కొత్త వేతన సవరణ అమలు అన్నది సాధ్యం కాదని తెలిసి కూడా అడుగుతున్నారా లేదా జగన్ ను ఉద్దేశ పూర్వకంగానే ఇరుకున పెడుతున్నా అన్న సందిగ్ధత ఒకటి కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతి అతీగతీ లేని విధంగా ఉంది. అందుకే కొత్త కోరికలు ఏవీ కోరకండి అని అంటున్నా ఉద్యోగ సంఘాలు వినిపించుకోవడంలో విఫలం అవుతున్నాయి. తమకు జీతాలు, వేతన సవరణలే ముఖ్యం అని ఇవన్నీ తమ హక్కులే గొంతు పెంచి మాట్లాడుతున్నాయి. ఇది ఒక విధంగా బ్లాక్ మెయిల్ అయినప్పటికీ బండి శ్రీను (ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షులు)కు తప్పడం లేదు. నిన్నటిదాకా తాను అనుకుంటే ప్రభుత్వాన్నే కూల్చేస్తానని చెప్పి సంచలనం అయ్యారు. తాను తల్చుకుంటే ఎంతటి నేత అయినా దిగి రావాలి అని కూడా అన్నారు. కొత్త పీఆర్సీ ఓ వేళ ఇస్తే జగన్ కు పుష్పాభిషేకం చేస్తానని చెబుతున్నారు.