మార్నింగ్ రాగా : పోరు వాన‌కు పొర్లు దండం సామీ!

RATNA KISHORE
బ‌య‌ట రాక్ష‌స వాన విచిత్రం కాక‌పోతే
లోప‌లంతా ఆత్మ‌శాంతి నివేద‌న కూడా...
నిర్మోహ వాన‌ల‌కు ఆహ్వానం కానీ లేవిక్క‌డ
ఉంటే బాగుండు..విల‌యాత్మ‌కం అయిన చోటున నేను
ప‌ట్టుమ‌ని ఓ ప‌ది వాక్యాల‌లో కూడా ఇమ‌డ‌ని నేను మ‌రియు వాన


ఊరు కొట్టుకుపోతే మ‌నిషి మిగిలాడు.. మ‌నిషి కొట్టుకుపోతే వాన మిగిలింది. మిగిలిన వాన ఇంకా ఉంది. దేశాన్నీ రాష్ట్రాన్నీ ప‌ట్టి పీడించు క‌న్నీటి వాన‌లే ఈ మిగిలిన వానలు. వాన‌లేవ‌యినా ఆత్మ శాంతి నుంచి దూరం కానివ్వ‌నీయ‌ని బంధంగా ఉంటే ఎంతో మేలు. అయ్యో! మ‌ర‌ణ వాంగ్మ‌యం ఒక‌టి అందించిన వాన‌ల‌కూ వాటి బంధాల‌కూ మ‌నం అన్యాక్రాంతం కానీయ‌ని కాప‌లాదారు లం. అందుకే వాన..లోప‌లి మ‌నిషిని మార్చ‌డం లేదు. బ‌య‌ట త‌త్వాన్ని సంస్క‌రించ‌డం లేదు. కేవలం తీరం దాటి పోయిన సంద ర్భాల‌కు మ‌నుషుల‌ను కాప‌లాదారులుగా నియ‌మించిపోతోంది. దుఃఖ‌దాయిని అయిన వాన‌ల‌ను కొండ‌ల్లో ఎందుకో తిట్ట‌రు.. కా నీ బండ రాళ్ల‌ను న‌గ‌రాలుగా మార్చిన మ‌నుషులే అస‌హ్య పూర్వ‌కంగా తిడ‌తారు. క‌నుక వాన‌కు బండ రాయి కాప‌లా ఉందో లేదో ఇప్పుడు.. బండ రాళ్ల కాపలా ఉంటే కొన్ని వాన‌లు వాటి ఉద్ధృతి ఆగిపోతోంది.లేదా నియంత్రితం అయి ఉంటుంది. వాన‌కు చేత‌గా ని మ‌నిషి కాప‌లా.. చేవ చ‌చ్చాక బుక్కెడు బువ్వ ఓ ఉప‌శ‌మ‌నం. అండ పిండ బ్ర‌హ్మాండాల్లో ఉన్న వాన‌కు ఆనందం వెలివేత‌లో ఉంది. వెలివేత‌ల‌కు గుర‌యిన వాన‌లు మాత్రం మ‌న‌కు స‌మీప దూరంలోనూ క‌నిపించ‌క‌పోవ‌డంలోనే విచారం దాగి ఉంది. లైఫ్ ఆ ఫ్ట‌ర్ డెత్.. చిన్న మాట. లైఫ్ ఆఫ్ట‌ర్ రైన్ .. ఇంకా చిన్న మాట.. కావొచ్చు.

 
మ‌నుషుల్లో భ‌యాలు పోయి న‌మ్మ‌కాలు మిగిలాయి. జ‌వాద్ తుఫాను మాత్రం నమ్మ‌కాలను కూడా త‌న‌వెంట ప‌ట్టుకుపోకుండా ఉంటే ఇంకొంద‌రికి అయినా సాంత్వ‌న చేకూరుతుంది. మిక్కిలి ఉప‌శ‌మ‌నం ఒకింత న‌మ్మ‌క‌మే కావొచ్చు. వైద్యం కూడా చెప్పేదిదే క‌దా! మ‌న ప‌రిజ్ఞానంలో ఉన్న‌వ‌న్నీ మ‌న చుట్టూ ఉన్న న‌మ్మ‌కాల‌ను మ‌రియు వాటిని ప్ర‌శ్నించ‌గ‌లిగే ఓర్పు ఉన్న వాన‌ల‌ను అందించి వెళ్తాయి. ప్ర‌శ్న వాన అయితే సంవిధాన విశ్లేష‌ణ జీవితం అయి ఉంటుంది. వాన ప్ర‌శ్న.. వాన నిర్మలం మాత్రం కాదు.. మాలిన్యం అయిన వాన‌లు కొన్ని మ‌నిషికి పుట్టెడు దుఃఖాన్ని అందించి వెళ్లాయి.

 
గంగ దూకిన ప్ర‌తిసారీ పెంకిత‌నం ఒక‌టి ఉంటుంద‌ని ఓ సినీ క‌వి (సిరివెన్నెల‌) చ‌మ‌త్కృతి. గంగ క‌ట్టు త‌ప్పి దూక‌కుండా మ‌నం మున‌గ‌కుండా ఈ వాన ఏం అయినా నియంత్ర‌ణ ఇచ్చిందా లేదు క‌దా! పై నుంచి గంగ పావ‌నమ‌యిన జీవ‌ధార అయి ఉంటుంద ని అన్ని వేళల్లో ఎలా అనుకోగ‌లం. గంగ మృత్యు గీత‌ల‌ను స్పృశించి నిర్ణ‌యించి వెళ్లిపోతోంది. అకాల వాన రాక దృష్ట్యా అకాల మ ర‌ణాలు సంభ‌విస్తాయి. మ‌ర‌ణం అన్న‌ది స్ప‌ష్ట‌మ‌యిన ఛిద్ర {{RelevantDataTitle}}