వామ్మో.. పాక్ లో మళ్ళీ నకిలీ?

praveen
కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ ఎప్పుడూ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగింది. ఈ క్రమంలోనే మోడీ సర్కార్ తీసుకుని చారిత్రాత్మక నిర్ణయాలలో నోట్ల రద్దు నిర్ణయం కూడా ఒకటి అనే చెప్పాలి. ఒక్కసారిగా పెద్ద నోట్లను రద్దు చేసి సంచలనం సృష్టించింది మోడీ సర్కార్. ఇలా చేయడం ద్వారా నల్లధనాన్ని పూర్తిగా నాశనం చేయాలి అని భావించింది. అయితే కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేయడం వల్ల అటు దాయాది దేశమైన పాకిస్థాన్ కు ఊహించని షాక్ తగిలింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒకప్పుడు భారత కరెన్సీ ని పాకిస్తాన్ కూడా తయారు చేసేది.

 భారత కరెన్సీ ని అచ్చం అలాగే అనధికారికంగా తయారు చేసి ఎంతో క్యాష్ చేసుకునే ది పాకిస్తాన్.. ఇలా భారత కరెన్సీ కారణంగా పాకిస్తాన్ ఎన్ని రోజుల పాటు ఆర్థికంగా ఎంతగానో ప్రయోజనం పొందింది అని చెప్పాలి. ఈ విషయాన్ని గ్రహించిన మోడీ సర్కార్ పెద్ద నోట్ల రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అటు పాకిస్థాన్ పై ఆర్థిక సర్జికల్ స్ట్రైక్ లాంటిదే అని అన్నారు ఎంతో మంది విశ్లేషకులు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పాకిస్తాన్ కు ఊహించని షాక్ తగిలింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ తర్వాత పాకిస్తాన్ భారత కరెన్సీని ముద్రించడానికి వీలు లేకుండా పోయింది.

 కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పాకిస్తాన్ మళ్లీ భారత కరెన్సీ కి నకిలీ కరెన్సీ తయారు చేస్తూ మళ్లీ ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తుందా అంటే అవును అనే విధంగానే మారిపోతుంది పరిస్థితి. ఇటీవలే డాకా లో బంగ్లాదేశ్ పోలీసులు ఏకంగా ఏడు కోట్ల విలువైన ఎటువంటి భారత కరెన్సీని పట్టుకున్నారు. అయితే ఈ భారత కరెన్సీ పాకిస్థాన్ నుంచి వచ్చింది అన్న విషయాన్ని గ్రహించారు అధికారులు. దీంతో పాకిస్థాన్ మళ్లీ నకిలీ కరెన్సీ కోసం కొత్త యంత్రాంగాన్ని కనిపెట్టిందా అన్న చర్చ మొదలయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: