జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మాకెందుకీ గొడవ..?
కొట్టుకున్నోళ్లు కొట్టుకోండి..తిట్టుకున్నోళ్లు తిట్టుకోండి కానీ మాకు మాత్రం కాసింత అభివృద్ధిని ప్రసాదించండి. మాకు మాత్రం కాసింత ప్రశాంతతను ప్రసాదించండి. ఏదేమయినప్పటికీ మన పని మనం చేసుకుని పోవాలి అన్న సిద్ధాంతంలో రాజకీయం ఉంది. ఏదయినప్పటికీ మన రాజకీయం మనకు ప్రశాంతతను ఇస్తే కాదు ఇతరులకు గందరగోళం ఇవ్వగలగాలి. ఆందోళనా పూర్వక రాజకీయం మేలు చేస్తుంది. ఆందోళన పూర్వక రాజకీయం అశాంతికి కారణం అవుతుంది. ఆ విధంగా ఆ వేళ ఆ విధంగా ఈ వేళ రెండు పార్టీలూ హాయిగా కొట్టుకుంటున్నాయి. నువ్వెంత అన్నది తరువాత కనీస మర్యాద కూడా లేకుండా ప్రవర్తించడం అన్నది ఇవాళ రాజకీయాల్లో తరుచూ జరిగే పరిణామం. అయినా కూడా ఎవ్వరూ ఎక్కడ వెనక్కుతగ్గపోవడం విచారకరం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేయాల్సిన సాయం ఏదో చేయాలి కదా నిండా మునిగిన ప్రజలకు అంటే ఎవ్వరయినా వింటారా?
రెండున్నరేళ్లలో జగన్ చేసింది ఏమీ లేదు. సంక్షేమ పథకాలు పేరిట ఆయన డబ్బులు పంచారు. ఇది మినహా అభివృద్ధి అయితే చేపట్టలేదు. కనీసం రోడ్ల మరమ్మతులకు కూడా నిధులు కేటాయించలేకపోయారు. ఇటీవల పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చినా కూడా ఇప్పటికీ ఆ పని మొదలు కాలేదు. ఈ దశలో శ్రీకాకుళం లాంటి మారుమూల ప్రాంతాల నుంచి ఎటువంటి స్పందన వచ్చినా అందుకు బాధ్యత వహించాల్సింది సీఎంనే!
ఇక ఇప్పటిదాకా అయింది చాలు ఇకపై ఏమయినా చేయండి. ముఖ్యంగా రహదారుల నిర్మాణం చేపట్టండి. డ్రయినేజీ వ్యవస్థను దారికి తెండి. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి వాటి పూర్తికి నిధులు ఇవ్వండి. ఇవేవీ లేకుండా రాజకీయం ఎలా చేస్తారు. ఎలా చేసినా చెల్లుతుందన్న భ్రమలో ఉండి చేస్తున్నారా? లేదా బాధ్యత ఉండే చేస్తున్నారా?