స్పందించిన బాలకృష్ణ.. ఏమన్నారో తెలుసా?

praveen
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏ క్షణంలో ఎలాంటి ఘటన జరుగుతుందో అన్నది కూడా ఊహకందని విధంగా మారిపోయింది. ఇటీవలే అసెంబ్లీ వేదికగా తన భార్యను దూషించారు అంటూ టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టుకుని.. వెక్కి వెక్కి ఏడవడం కాస్త ఏపీ రాజకీయాల్లో సంచలనం గానే మారిపోయింది అని చెప్పాలి. టిడిపి నేతలు తెలుగు తమ్ముళ్లు మొత్తం ఇక వైసీపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా ప్రస్తుతం అధికార పార్టీ నేతల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు.

 అంతేకాదు వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను కూడా తిప్పికొడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ కీలక నేత ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో పరిణామాలు పై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవాళ్ళ జోలికి వస్తే చేతులు కట్టుక్కోవడం సరికాదంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించారు. మంచి సలహా ఇచ్చినా తీసుకునే పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం లేదు అంటూ ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యానించారు. మీరు మారకపోతే మెడలు వంచి మార్చి తీరుతాం బాలకృష్ణ వ్యక్తం చేశారు. మంగళగిరిలో ఉన్న పార్టీ కార్యాలయాలపై దాడులు చేయించారు.. చంద్రబాబు పై ఎన్నో విధాలుగా దాడులకు ప్రయత్నించినా ఆయన ఎంతో సంయమనంతో వున్నారు అంటూ బాలకృష్ణ అన్నారు.


 ఇకపై ఎవరు నోరు తెరిచిన కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు ఆడవాళ్ళని తెరమీదికి తెచ్చి మైండ్గేమ్ ఆడుతున్నారు రాజకీయాల్లో అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు అన్న ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని రకాల వ్యవస్థలను నిర్వీర్యం చేశారు  మీకు దాసోహం చేసేలా చేసుకోవడం ఏమాత్రం మంచిది కాదు అంటూ బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలు ఎంతో బాధాకరం అంటూ వ్యాఖ్యానించారు. సజావుగా సాగాల్సిన అసెంబ్లీ కాస్త వ్యక్తిగత దూషణలకు వేదిక గా మారిపోయిందని బాలకృష్ణ అన్నారు.

 రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అన్న విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు అంటూ బాలకృష్ణ అన్నారు. నా సోదరి భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతో బాధాకరం అంటూ బాలకృష్ణ తెలిపారు. అసెంబ్లీ లో ఉన్నామో పశువుల గుంపు లో ఉన్నామో అర్థం కావడం లేదు అంటూ బాలకృష్ణ అన్నారు. అందరి కుటుంబాల్లో కూడా ఆడవాళ్లు ఉన్నారని మహిళలను హేళన చేయవద్దు అంటూ వ్యాఖ్యానించారు. ఏకపక్షంగా సభను నడపడం  మంచిది కాదు అన్నారు బాలకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: