కేసీఆర్ దెబ్బకు దిగి వచ్చిన మోడీ.. నిజమేనా?
ఎందుకంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ సాగు చట్టాలను రద్దుచేస్తూ వెనక్కి తీసుకుంటున్నాను అంటూ ప్రకటించడం సంచలనం గా మారిపోయింది. అయితే కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి అంటూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు చేస్తున్న ఉద్యమం చివరికి విజయం సాధించింది అని చెప్పాలి. ఇప్పటివరకు ఒక్క సారి కూడా వెనకడుగు వేయని మోడీ ప్రభుత్వం వ్యవసాయ సాగు చట్టాల విషయంలో మాత్రం వెనకడుగు వేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇలాంటివి జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటాయి.
ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ కూడా ఇలాంటి ప్రచారం చేసుకునే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కెసిఆర్ విమర్శలు చేస్తున్నారు. అంతే కాదు కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇటీవలే ధర్నా కూడా చేపట్టారు. ఢిల్లీకి వెళ్లి ఉద్యమం చేపడుతున్న రైతులకు మద్దతు ఇస్తామంటూ కేసీఆర్ తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ దెబ్బ కి మోడీ దిగి వచ్చారు అని చెప్పుకునే అవకాశం కూడా ఉందని రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణం అని అంటున్నారు విశ్లేషకులు.