కుప్పం పాలిటిక్స్ : వైసీపీపై టీడీపీ ఫిర్యాదు !

Veldandi Saikiran
అమరావతి : కుప్పం మున్సిపాలిటీలో ప్రచార పర్వం ముగిసినా పెద్దఎత్తున స్థానికేతరులు తిష్ఠవేశారని ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది.  పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున తరలించారని ఫిర్యాదు చేసింది. వెలుగు ఉద్యోగులను కుప్పంకు తరలించారని ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. కుప్పానికి 15 కి.మీ. దూరంలో 300 మందికి వసతి కల్పించారని ఎస్ఈసీ దృష్టికి తెచ్చింది టీడీపీ పార్టీ. రాజా పార్కు కమ్యూనిటీ హాలులో 60 మందికి వసతి కల్పించారన్న టీడీపీ... వైసీపీకి చెందిన 300 మంది సర్పంచులు, ఎంపీటీసీలు బస చేశారని ఎస్ఈసీకి ఆధారాలు సమర్పించింది టీడీపీ. తంబళ్లపల్లి నుంచి వచ్చిన 500 మంది మహిళలకు కుప్పం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వసతి కల్పించారని ఫిర్యాదు చేసింది తెలుగు దేశం పార్టీ.

వంద మంది డ్వామా ఫీల్డ్‌ అసిస్టెంట్లకు సీఎల్‌ఆర్‌సీ భవనంలో వసతి కల్పించారని ఫిర్యాదు చేసింది తెలుగు దేశం పార్టీ. చర్యలు తీసుకోవాలని టీడీపీ పార్టీ డిమాండ్‌ చేస్తుంది. వీడియో, ఫొటో ఆధారాలను లేఖకు జత చేశారు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు. ఓటర్ల కు డబ్బులు పంచుతున్నారంటూ వీడియో క్లిప్పింగులను ఆధారాలుగా జతపరిచింది టీడీపీ పార్టీ. ఓటుకు రూ.3 వేల నుంచి 5 వేలు పంచుతూ ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసింది తెలుగు దేశం పార్టీ. అయితే.. వైసీపీ పార్టీ నేతల పై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆ లేఖ లో పేర్కొంది తెలుగు దేశం పార్టీ.  కుప్పం మున్సిపాలిటీ లో ఎలాగైనా గెలువాలనే నేపథ్యంలోనే...  వైసీపీ పార్టీ నేతలు చాలా దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు స్పష్టం చేసింది తెలుగు దేశం పార్టీ నేతలు.దీనిపై కచ్చితంగా ఎన్నికల సంఘం చర్య లు తీసు కోవా ల ని డి మాండ్ చే శా రు తె లుగు దేశం పార్టీ నేతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: