హుజురాబాద్ ఎన్నికల ఫలితం పూర్తిగా బీజేపీకి అనుకూలం అయిపోయాక కేసీఆర్ లో విపరీతం అయిన పరిణితి, రైతు పై విపరీతం అయిన పట్టింపు వచ్చాయన్న ఆరోపణ ఒకటి తప్పుడు సంకేతంగా నడుస్తోంది. ఎందుకంటే కేసీఆర్ ఎప్పటి నుంచో రైతు సమస్యలపై మాట్లాడుతూనే ఉన్నారు.ఇవాళేం కొత్త కాదు. తాను చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. కనుక వాటిపై ఇప్పుడు కొత్తగా చెప్పింది, చెప్పాక రాజకీయం చేసింది ఏమీ లేదు ఉండదు కూడా! విపక్షాలు నోటికి వచ్చిన విధంగా మాట్లాడినంత మాత్రాన కేసీఆర్ ఇజ్జత్ ఏమీ తగ్గిపోదు.అయితే కొందరు వాస్తవాలు విడిచి మాట్లాడాలి కనుక మాట్లాడుతున్నారు. రాజకీయం సుద్ధపూసలు ఎవ్వరూ ఉండరు గాక ఉండరు. అందుకు గులాబీ దండు కూడా అతీతం కాకున్నా కాస్తయినా తెలంగాణ కోసం పరిణితితో కూడిన మాటలు చెప్పడం కేసీఆర్ కే చెల్లు.
ఇక ఆంధ్రా పరిణామాలపై ఆంధ్రా నీటి వాటాలపై ఎప్పటికప్పుడు మాట్లాడే కేసీఆర్ ఇవాళ కూడా బాగానే మాట్లాడారు. నీటి పంచాయితీపై తనకు స్పష్టమయిన అవగాహన ఉందని, గోదావరి నీళ్లు సీమకు తరలిస్తే అందుకు తగ్గ కృషి చేస్తే తాను కూడా సహకరిస్తానని చెప్పానని మరో మారు గుర్తు చేశారు. పుష్కలంగా లభ్యం అవుతున్న గోదావరి నీళ్లు సీమ దాహార్తిని తప్పక తీరుస్తాయని మీడియా మీట్ లో చెప్పారు.
ఇదే సందర్భంలో పొరుగున సీఎం గురించి ఒక్క మాట కూడా ఆయన ప్రస్తావించలేదు. నిన్నటి వేళ కనీసం జగన్ ప్రచురింపజేసిన వాణిజ్య ప్రకటన (పెట్రో రేటుకు సంబంధించి) గురించి అయినా మాట్లాడాడు కానీ ఇవాళ అది కూడా లేదు. ఆయన ఏపీ ప్రస్తావన లేకుండానే మాట్లాడేందుకు ఎందుకనో అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు. నీటి పంచాయితీలోనూ, ఇంకా ఇతర విషయాల్లోనూ ఆయన మునుపటి సహకారం కానీ సహాయం కానీ అందించేందుకే సిద్ధం గా ఉన్నారు. కనుక ఏపీ, తెలంగాణ కలిసి పనిచేస్తేనే విభజన చట్టం అమలు అన్నది సుస్పష్టంగా అమలు కావడం లేదా పకడ్బంధీగా అమలు కావడం తథ్యం.