జగనుకు మోడీ భయం పట్టుకుంది ?

Veldandi Saikiran
అమరావతి : ఏపీ ప్రభుత్వం తీరు పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఏపీ బిజేపి  పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.  జగనుకు మోడీ భయం పట్టుకుందని.. మోడీ తో జగన్ ఢీ అనాలనుకుంటే మేమూ సిద్ధంగా ఉన్నామనీ పేర్కొన్నారు  సోము వీర్రాజు. మేము ఏంటో ఏపీ ప్రభుత్వానికి చూపిస్తాం... కేంద్ర ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రకటనలు ఇస్తారా..?అని నిలదీశారు  సోము వీర్రాజు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది... అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు టాక్సులు తగ్గించినప్పుడు ఏపీ ప్రభుత్వం  ఎందుకు తగ్గించదు..?అగ్రహించారు  సోము వీర్రాజు. 

 మేము సాయం చేస్తేనే ఏపీని పరిపాలిస్తామని ఎన్నికల ముందు ఎమ్మెల్యే పార్థసారథి  ఎందుకు చెప్పలేదు..? వైసీపీకి ఓట్లు వేస్తే ప్రత్యేక హోదా, రాజధాని తెస్తామని ప్రజలను మోసం చేశారని నిప్పులు చెరిగారు  సోము వీర్రాజు.



ఏపీలో జాతీయ రహదారులను అభివృద్ధి చేసాం... రాజధాని ఇక్కడే ఉండాలని మేము అభివృద్ధి చేస్తున్నామన్నారు  సోము వీర్రాజు. ఏపీలో రూ. 2500 కోట్లు రాజధానికి ఇచ్చాం.. రూ. 4700 కోట్ల రుణం ఇప్పించామనీ.. రోడ్లపై గోతులు పూడ్చలేని జగన్ ప్రభుత్వం.. గోతులు తవ్వే రాజకీయాలు చేయడం సరికాదన్నారు  సోము వీర్రాజు. మాట ఇచ్చి రాజధానిని ఎందుకు తరలిస్తున్నారు..? రాజధానిపై ఇచ్చిన మాటను ఎందుకు తప్పారు..? రాజధాని నిర్మాణం పేరుతో రూ. 4 సెస్ వసూలు చేస్తూ రాజధాని ఎందుకు నిర్మించడం లేదు..? అని అగ్రహించారు  సోము వీర్రాజు. రాజధాని నిర్మిస్తామని ఒకరు పారిపోయారు. అస్తవ్యస్తం నిర్ణయాలతో ఆంద్ర రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని మండిపడ్డారు  సోము వీర్రాజు.. రాష్ట్ర అభి వృద్ధిపై ప్రభుత్వానికి  చర్చకు రావాలని ఛాలెంజ్ విసురుతున్న.. మేము ఎంత  పెంచామో ఎంత తగ్గించామో చాలా స్పష్టంగా చెప్పామనీ వేలాడించారు  సోము వీర్రాజు.
ఎపి ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్  ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: