హుజురాబాద్ లో బిజెపి విజయం సాధించిన తర్వాత తెలంగాణ టిఆర్ఎస్ పార్టీలో కొత్త టెన్షన్ మొదలైంది. తెరాస నుండి కొంత మంది ఎమ్మెల్యేలను బిజెపిలోకి తిప్పుకునే అవకాశం ఉందని గులాబీ పార్టీ నాయకులు గుబులు పడుతున్నారు. ఇప్పటికే హుజురాబాద్ విజయం తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పు వస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ సమయంలోనే తమకు అందివచ్చిన సమయాన్ని క్యాష్ చేసుకోవాలని బిజెపి మరింత ప్లాన్ వేస్తోంది.
తెలంగాణలో బిజెపి ఎలాగైనా పట్టు సాధించడం కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తోందని చెప్పవచ్చు. ఈటల రాజేందర్ గెలుపు తర్వాత కొంతమంది తెరాస ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని రఘునందన్ రావు అన్నారు. కానీ సాధారణంగా ప్రత్యర్థి నాయకులను ఇబ్బంది పెట్టడంలో చాలామంది నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. కానీ రఘునందన్ రావు వ్యాఖ్యలపై మాత్రం టిఆర్ఎస్ లో విపరీతంగా చర్చ సాగుతోంది. తెరాస పార్టీలో ఉంటూ బిజెపి వైపు చూస్తున్నా ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అని ఆ పార్టీ అందులో ఉన్న కొంత మంది ఎమ్మెల్యేలపై కన్నేసింది అని టాక్.. తెరాస లోని కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని వాదనలు వచ్చిన నేపథ్యంలో,
ఒకవేళ బీజేపీ గాలం వేస్తే వీరికే వేస్తుందని భావించిన తెరాస పార్టీ కొత్త మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టిందని సమాచారం. గెలుపుతో ఊపు మీదున్న బిజెపి తెరాస ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో పడ్డట్టు గులాబీ శ్రేణులు భావిస్తూ వస్తున్నాయి. ఇలా పార్టీలో ఎవరెవరున్నారు అనే దానిపై ఎక్కువగా దృష్టి పెట్టారని, పార్టీలో ఎవరు అసంతృప్తితో ఉన్నారో వారిపై కన్నేసి ఉంచారని తెలుస్తోంది. ఎందుకంటే ఎవరు కూడా బిజెపి వలలో పడకుండా ముందుగానే అప్రమత్తం అవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంతోనే తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ సాగుతోందని జోరుగా రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.