పీకల్లోతు కష్టాల్లో చైనా.. వరుస సంక్షోభాలు..?
చైనాకు ఆ మధ్య ఆస్ట్రేలియాపై కోపం వచ్చింది... ఆస్ట్రేలియా నుంచి చైనా భారీగా బొగ్గు దిగుమతి చేసుకుంటుంది. ఆస్ట్రేలియాకు చైనా నుంచి భారీగా ఆదాయం వస్తుంటుంది. అయితే.. చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలని చైనా భావించింది. అందుకే.. ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతిపై ఆంక్షలు విధించింది. అయితే.. చైనాలో అధిక విద్యుదుత్పత్తి బొగ్గు ద్వారానే జరుగుతుంది. ఆస్ట్రేలియాను కట్టడి చేయాలన్న ఉద్దేశ్యంతో చైనా అక్కడి నుంచి బొగ్గు కొనుగోళ్లను ఆపేసింది.
ఈ నిర్ణయం ద్వారా ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం అవుతుందని చైనా భావించింది. అయితే.. చైనా ఒకటి తలిస్తే జరిగింది ఇంకొకటి. చైనా నిర్ణయంతో విద్యుత్తు కొరత రూపంలో చైనాకు కొత్త ముప్పు వచ్చింది. ఒక్కసారిగా విద్యుత్ కొరత చైనాను ముప్పు తిప్పలు పెట్టింది. చివరకు చైనా నగరాల వీధి లైట్లు కూడా వెలగని దుస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు చైనా తన డీజిల్ నిల్వలతో విద్యుత్తు ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. దీంతో.. మరో సమస్య చైనాను ఇబ్బంది పెట్టింది.
డీజిల్ తో విద్యుత్ ఉత్పత్తి కారణంగా చైనాలో వాహనాలకు ఇంధన కొరత వచ్చింది. అది కాస్తా ముదిరి.. ఇంధన విక్రయాలపై రేషన్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పటికే చైనాను ఆహార కొరత వేధిస్తోంది. తాజాగా చైనా కొత్త నిర్ణయాలతో వరుస ఇబ్బందులు, సంక్షోభాలు తలెత్తాయి. ఇక కరోనా సంగతి తెలిసిందే. అసలు కరోనా పుట్టిందే ఇక్కడ.. ఇప్పుడు మళ్లీ చైనాలో కరోనా వేరియంట్ విజృంభిస్తోంది. ఇప్పుడు చైనాలో మళ్లీ చాలా నగరాలు లాక్‌డౌన్ల దిశగా అడుగులు వేస్తున్నాయి.