ఇండియాలోనే కాదు.. అమెరికాలోనూ అదే పరిస్థితి?

praveen
కరోనా సంక్షోభం తర్వాత భారత్లో అన్ని వస్తువుల ధరలు ఎంతలా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజురోజుకు పెరిగిపోతున్న ధరలు సామాన్య ప్రజలకు భారం గా మారిపోతున్నాయి. ఇక ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో సామాన్య ప్రజలు లబోదిబోమంటున్నారు. అదే సమయంలో అటు కూరగాయల ధరలు కూడా భారీగా పెరుగుతూ ఉండడం గమనార్హం. మరోవైపు పెట్రోల్ ధరలు అయితే ఏకంగా నిప్పు అంటించుకునే భగ్గుమంటున్నాయి. సామాన్య ప్రజలు అందరికీ గుదిబండలా మారిపోయాయి.


 మరోవైపు వంట గ్యాస్ ధరలు వస్తువుల ధరలు ఇలా చెప్పుకుంటూ పోతే కరోనా సంక్షోభం తర్వాత దాదాపుగా అన్ని రకాల ధరలు ఊహించని రీతిలో పెరిగిపోయాయ్. సామాన్య ప్రజలను వెన్ను విరుస్తున్నాయి అని చెప్పాలి. అయితే అన్ని ధరలు పెరుగుతున్నాయి కాని సామాన్యుల ఆదాయం మాత్రం పెరగక పోవడం గమనార్హం. అయితే ఇలా ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో అటు కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం లాంటివి చూస్తూ ఉన్నాం. కానీ అసలు విషయం ఏంటంటే కేవలం భారత్లో మాత్రమే కాదు అగ్రరాజ్యాలతో సైతం ఇలా ధరలు జరిగే పరిస్థితి వచ్చింది అన్నది ఇప్పుడు అర్థమవుతోంది.


 వైరస్ కారణంగా అన్ని రకాల సంస్థలు కూడా సంక్షోభంలో కూరుకుపోయాయ్ అనే విషయం తెలిసిందే. లాభాల్లో ఉన్న కంపెనీలు సైతం మూతపడటంతో ఇక నష్టాల బాట పట్టాయి. ఇలాంటి సమయంలో ఇక ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో మళ్ళీ కంపెనీలను పునః ప్రారంభిస్తున్నాయి యాజమాన్యాలు. మొన్నటి వరకూ వచ్చిన నష్టాలను  కూడా మళ్లీ ఇప్పుడు రికవరీ చేసుకోవాలి  ప్రయత్నిస్తున్నారట. ఈ క్రమంలోనే ఇటీవల అమెరికాలో కూడా ధరలు పెంచేందుకు సిద్ధం అయ్యాము కంపెనీ యాజమాన్యాలు ప్రకటించడం గమనార్హం. ఇలా కేవలం భారత్ లో మాత్రమే కాదు అగ్రరాజ్యాలలో సైతం ఇలా ధరల పెరుగుదల సమస్య ఉంది అని అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: