త్వరలో బిసి బంధు.. కెసిఆరే చెప్పారట?
కేవలం రాష్ట్రంలో మీకు దళితులు మాత్రమే కనిపిస్తున్నారా.. మా ఓట్లు అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. ఇక అదే సమయంలో మాకు బిసి బందు కూడా ప్రకటించాలంటూ బిసి వర్గానికి చెందిన ప్రజలందరూ నిరసనలు కూడా తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే దళిత బంద్ ప్రకటించి సంచలనం సృష్టించిన సీఎం కేసీఆర్ మరికొన్ని రోజుల్లో కూడా బీసీ బందు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు ఏకంగా రాష్ట్రబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య. ఇటీవలే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తన మద్దతు ఎవరికి ఉంటుంది అనే దాని పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి తన మద్దతు ఇస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. ఇటీవలే హైదరాబాద్ లో బీసీ ఉద్యోగ కుల సంఘాల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఆయన. అయితే దళిత బంధు ప్రవేశపెట్టినట్లు గానే బీసీ బందు కూడా ప్రవేశ పెట్టడానికి కెసిఆర్ అంగీకరించారని.. ఇక వచ్చే బడ్జెట్ లో బీసీ బంద్ కి సంబంధించి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు అంటూ ఆర్.కృష్ణయ్య చెప్పుకొచ్చారు. అంతేకాదు బీసీ కుల గణన పై కూడా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చారు.