షర్మిల పాదయాత్ర సంధర్భంగా వైఎస్ విజయమ్మ ఆసక్తిక కామెంట్లు చేశారు. చేవెళ్ల ప్రజలను చూస్తే అనాడు వైఎస్సార్ పాదయాత్ర గుర్తుకు వస్తుందని అన్నారు. ఆనాడు కార్ లో కూర్చొని మొత్తం సభ చూశానని...సబితా కోరిక మేరకు చేవెళ్ల నుంచి వైఎస్సార్ పాదయాత్ర మొదలు పెట్టారని విజయమ్మ వ్యాఖ్యానించారు. సబితా మంచి మనసు అని చెప్పి చేవెళ్ల ను వైఎస్సార్ ఎంచుకున్నారని....చేవెళ్ల యాత్ర ను ప్రజలు ముందుకు తీసుకు వెళ్ళారని విజయమ్మ చెప్పారు. చేవెళ్ల మా కుటుంభానికి మొదటి మెట్టని...తమ కుటుంబానికి చేవెళ్లకి ఆత్మీయ సంబంధం ఉందని విజయమ్మ వ్యాఖ్యానించారు. చేవెళ్ల వైఎస్సార్ ఉద్యమానికి వేధిక అయ్యిందని....వైఎస్సార్ పాదయాత్ర ఒక ఉద్యమం అయ్యిందంటూ చెప్పుకొచ్చారు. మహాయజ్ఞం ఒక సంక్షేమ ఉద్యమం అయ్యిందని విజయమ్మ అన్నారు.
పాదయాత్ర కంటే మించిన సాధనం లేదని..ఆనాడు 2003 లో ఉమ్మడి రాష్ట్రం లో ఎన్నో బాధలు వైఎస్సార్ గుర్తించారని గుర్తుచేశారు. పాదయాత్ర పరుగు పందెం కాదని....ఎన్ని లక్షల మంది కలిశాం... ఎంత ధైర్యం చెప్పగలిగాం అనేది ముఖ్యమంటూ విజయమ్మ స్పష్టం చేశారు. చేవెళ్ల ప్రజాప్రస్థానం ఒక చరిత్ర సృష్టించిందని..ఒక మహర్షి లా వైఎస్ పాదయాత్ర చేశారంటూ విజయమ్మ వ్యాఖ్యానించారు. పాదయాత్ర తో వైఎస్ బలమైన నాయకుడిగా ఎదిగారని....వైఎస్ పాదయాత్ర ఏపి చరిత్ర నే మార్చి వేసిందంటూ విజయమ్మ వెల్లడించారు. అధికార పార్టీ లో ప్రకంపనలు రేపిందని..దేశానికి వైఎస్ పాదయాత్ర ఒక ఆదర్శం అయ్యిందని విజయమ్మ వెల్లడించారు. కులం,మతం,ప్రాంతం బేధం లేకుండా ఆశీర్వదించారని...పాదయాత్ర తో మొత్తం రాష్ట్రాన్ని వైఎస్సార్ అవగాహన చేసుకున్నారని విజయమ్మ చెప్పారు.
జలయజ్ఞం పథకం పుట్టింది కూడా పాదయాత్ర తోనేని...కోయిల్ సాగర్,భీమా,నెట్టెంపాడు,చేవెళ్ల ప్రాణహిత,పాలమూరు ప్రాజెక్ట్ లు అన్ని వైఎస్సార్ విజన్ తోనే వచ్చాయని తెలిపారు. షర్మిలకు వైఎస్ అంటే ప్రపంచమని...షర్మిలతో బంగారు తెలంగాణ సాధ్యమని చెప్పారు. వైఎస్సార్ బంగారు తెలంగాణ చేయాలని చూశారని...వైఎస్సార్ ఆశయాలను షర్మిల నెరవేరుస్తుందని విజయమ్మ వ్యాఖ్యానించారు. చరిత్ర లో ఎప్పుడు కూడా ఏ మహిళ కూడా పాదయాత్ర చేసిన సందర్భం లేదని....గతంలో 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిందని...ఖమ్మం లో 50 డిగ్రీల ఎండలో పాదయాత్ర కొనసాగిందని విజయమ్మ వ్యాఖ్యానించారు. షర్మిల ఏది పట్టుకున్నా సాదించే దాకా వదలదంటూ విజయమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.