ఎంపీలకు సరైన భద్రత లేదా?

VAMSI
బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు డేవిడ్ ఆమెస్ హత్య చేయబడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటన తర్వాత ప్రపంచంలో ఉన్న ఎంపీలకు ఎటువంటి భద్రత ఉంది. ఇదే విధంగా వివిధ దేశాలలో ఉన్న రాజకీయ నాయకులు ఏ విధమైన భద్రతను కలిగి ఉన్నారో ద్వారా తెలుసుకుందాం.
బ్రెజిల్  

ఈ దేశంలో రాజకీయ పరిస్థితులు రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ సేవలు అందిస్తున్న రాజకీయ నాయకులకు అంత భద్రత ఉండదని తెలుస్తోంది. అయితే ఇక్కడ రాజకీయ పదవుల కోసం జరిగే పోరాటంలో ఒక్కసారి వారికి వటే శత్రువులుగా మారిపోతుంటారు. మామూలుగా రాజకీయ నాయకులు ప్రజల మధ్యలోకి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. సభల్లో పాల్గొనడానికి, ర్యాలీలో పాల్గొనడానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇదే సమయంలో రాజకీయ నాయకులకు భద్రతగా బాడీ గార్డులు ఉండడం మనం గమనించవచ్చు.  అయితే అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో  జైర్ బోల్సోనారో ను తుపాకితో కాల్చారు.
నెదర్లాండ్
ఈ దేశంలోని ప్రధాని ఏకంగా సైకిల్ మీద పార్లమెంట్ కు వెళ్లారు. ఈ విధమైన పరిస్థితులు ఆ దేశం యొక్క పటిష్టమైన భద్రతను తెలియచేస్తాయి. అంతే కాకుండా హింస లేని ప్రదేశంగా మనము అంతా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలా సైకిల్ పై పార్లమెంట్ కు రావడంపై అప్పట్లో విమర్శలు ఎదురయ్యాయి. అనూహ్యంగా ఈ ప్రధానిపై హత్య చేయడానికి ప్రయత్నించినందుకు 22 సంవత్సరాల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.  ఇలా జరగడం వల్ల అప్పటి నుండి నెడర్లండ్ లోని ఎంపీలు నేరుగా ప్రజలను వెళ్లి కలవడం లేదు. కేవలం అత్యవసరం అయితేనే ప్రజాల్ను కలవడానికి వెళతారు.
అమెరికా
ఒక్కసారిగా ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ మార్చేసింది. ఇక్కడ ముఖ్యంగా డెమోక్రాటిక్ మరియు రిపబ్లిక్ నాయకులు దాడులకు గురవుతూ ఉండేవారు. గత నాలుగు సంవత్సరాల క్రితం లూసియానా కు చెందిన రిపబ్లిక్ పార్టీ నాయకుడు స్టీవ్ స్కాలైజ్ బాస్ బాల్ ఆడుతుండగా సడెన్ గా లెఫ్ట్ వింగ్ కు చెందిన ఉద్యమ కారుడు తనపై కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచాడు. అంతకు ముందు 2011 లో ఒక రాజకీయ సమావేశంలో గన్ మాన్ చేతిలో డెమోక్రాటిక్ రాజకీయ నాయకురాలు గాయపడ్డారు. అందుకే ఎక్కువగా ఇక్కడ రాజకీయ నాయకులు బహిరంగంగా జరిగే కార్యక్రమాలకు వెళ్ళరు.
భారతదేశం
ఈ దేశం పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది పెద్ద ప్రజాస్వామిక దేశం అని, ఇక్కడ ఎంపీగా ఎన్నిక అయితే లభించే ఉపయోగాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా భద్రత విషయంలో చాలా పటిష్టంగా ఉంటుంది. అయితే ఎంపీలు అందరికీ ఓకె విధమైన భద్రత ఉండదు. వారి వారి రాజకీయ ప్రమాద పరిస్థితులను బట్టి భద్రతను అందిస్తారు. ఒకవేళ కొందరు ముఖ్యమైన వారి అయినా లేదా వారికి శత్రువుల నుండి ప్రమాదం ఉందని తెలిసినా వారిని కేంద్ర హోం మంత్రి శాఖ ప్రత్యేకంగా గమనిస్తూ ఉంటారు. బయట మీటింగ్ లకు వెళ్ళినప్పుడు కూడా వీరికి భద్రత భారీగా ఉంటుంది. అయితే ఇంత భద్రత ఉన్నప్పటికీ కొన్ని దాడులు జరగలేదని చెప్పలేము. అయితే అవి అంత పెద్దవి ఏమీ కాదు. రెండు సంవత్సరాల క్రితం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్  ప్రచారానికి వెళ్ళినప్పుడు, ఎవరో ఆయనను చెంపదెబ్బ కొట్టాడు. అయితే గతంలో జరిగిన ఘటనలు అందరికీ తెలిసినవే.
కెన్యా
ఈ దేశంలో ఉన్న ఎంపీలకు ఒక పోలీసు అధికారి భద్రతను అందిస్తూ ఉంటాడు. ఇతను ఆయుధాలను కలిగి ఉంటాడు. అయితే వారి స్థాయిని బట్టి భద్రత స్థాయి పెరగడం తగ్గడం ఉంటుంది. అత్యధికంగా కెన్యా ఉపాధ్యక్షుడు మొత్తం 257 మంది భద్రతా అధికారులను కలిగి ఉండేవాడు. అయితే ఇది నచ్చని వారు చేసిన నిరసనల కారణంగా కొంత భద్రతా సిబ్బందిని తగ్గించారు. అయితే ఇక్కడ తరచూ ప్రజల్లోకి రాజకీయ నాయకులు వెళుతూ ఉంటారు. కానీ అన్ని సార్లు పరిస్థితులు ఒకేలా ఉండవు. అదే విధంగా 2014 లో ఒక ర్యాలీ లో  రైలా ఒడింగాపై వాకింగ్ స్టిక్ దాడి జరిగింది.
ఇలా వివిధ దేశాల్లో ఎంపీలకు భద్రత ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: