దసరా పండక్కి.. షాకిచ్చిన పెట్రోల్ ధరలు?
ఇప్పటికే గత కొంత కాలం నుంచి భారీగా పెట్రోల్ ధరలు పెరిగిపోవడంతో వాహనదారులు అందరూ ఎంత బెంబేలెత్తిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ముఖ్యంగా సామాన్య ప్రజలపై అయితే పెరుగుతున్న పెట్రోల్ ధరలు గుదిబండలాగా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఏదైనా అత్యవసరమైతే తప్ప వాహనాలను అస్సలు బయటకు తీయడం లేదు సామాన్య ప్రజలు. ఈ విజయదశమికి తమకు మంచి జరగాలని కోరుకుంటున్న వారి కంటే అటు పెట్రోల్ ధరలు తగ్గాలి అని కోరుకుంటున్న సామాన్య ప్రజలే ఎక్కువగా ఉన్నారు అని చెప్పాలి.
ఇకపోతే ఇటీవల పెరిగిన పెట్రోల్ ధరలు తో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 105.14 రూపాయలుగా ఉంది. లీటర్ డీజిల్ ధర 93.87 రూపాయలుగా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ 111.09 రూపాయలు.. లీటర్ డీజిల్ 101.78 రూపాయలు ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ 102.4 ₹రూ లు.. లీటర్ డీజిల్ 98.26 రూపాయలు ఉంది. ఇక మధ్యప్రదేశ్లో అయితే పెట్రోల్ ధరలు మరింత భగ్గుమంటున్నాయి. లీటర్ పెట్రోల్ ధర 113.73 రూపాయలు లీటర్ డీజిల్ ధర 103.03 రూపాయలు ఉంది.