తారక్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసి ప్రభాస్ ఫ్యాన్స్ ని డిస్సపాయింట్ చేస్తున్న నీల్?

Purushottham Vinay
యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్ నుంచి వరుస హిట్లు కొడుతున్న సంగతి తెలిసిందే. 2014 నుంచి 2022 దాకా ఎన్టీఆర్ కి ఒక్క ప్లాప్ కూడా పడలేదు.  అందుకే ఈ పెద్ద హీరో రెట్టించిన ఉత్సాహంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతోన్నాడు. ఇలా ఇప్పుడు తారక్ కొరటాలా శివ దర్శకత్వంలో 'దేవర' అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.ఈ ప్రతిష్టాత్మక మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. దీన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ నేరుగా బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌తో కలిసి 'వార్ 2' మూవీ చేస్తాడు. ఇప్పటికే ఈ మూవీ షూట్‌లో కూడా పాల్గొంటున్నాడు.జూనియర్ ఎన్టీఆర్ తన 31వ సినిమాను KGF, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించాడు. ఈ కాంబో పై ఎప్పుడో అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ, ప్రభాస్‌తో సినిమాను రెండు పార్టులుగా చేయబోతుండడంతో ఈ సినిమా ఆలస్యం అవుతోంది. పైగా దీనికితోడు ఎన్టీఆర్ కూడా బిజీగా ఉండడంతో ఈ సినిమా మరింత లేట్ అవుతుంది.


భారీ రేంజ్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే లేదా జూన్ నుంచి మొదలు పెడతామని ప్రశాంత్ నీల్ గతంలోనే వెల్లడించాడు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం అయ్యే అవకాశం లేదని సమాచారం తెలిసింది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా నుంచి  జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకుని NTR31 మూవీ నుంచి అతడికి శుభాకాంక్షలు చెబుతూ చిత్ర యూనిట్ ఓ పోస్టు చేసింది. ఇందులో ఈ సినిమాను 2024 ఆగస్టు నుంచే ప్రారంభిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. అంటే.. అంతకు ముందు నుంచే ఈ మూవీ కార్యక్రమాలు మొదలు కానున్నాయని తెలుస్తుంది. ఇది తారక్ అభిమానులకు బర్త్‌డే బొనాంజాగా మారి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం అంత హ్యాపీగా లేరని తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాని స్టార్ట్ చెయ్యడం వల్ల సలార్ 2 వాయిదా పడుతుంది. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ కొంచెం నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.. ఇదే టైటిల్ తో తమిళ్ లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా సినిమా రాబోతుంది. దీంతో తమిళ్ ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: