ఆ మాజీ సి.ఎం తాజా డిమాండ్ ఏంటి ?
ఆమె భారత్ లోని అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆమెను కాబోయే ప్రధాన మంత్రి అని కూడా చాలా ఏళ్ల క్రితం ప్రచారం జరిగింది. ఆమె ఎన్నికల వ్యూహాల్లో ఆరితేరిన వ్యక్తి అని కూడా పాత్రికేయ ప్రపంచం పేర్కోంది. వీరి అంచనాలను మించి ఆమె రాజకీయ ఎత్తులు, జిత్తులు ఉండేవి. పేరుకు బహుజనుల పార్టీ అయినా, ఆమె ఓ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో అగ్రవర్ణాలకు అత్యధికంగా సీట్లు కేటాయించి, వియాన్ని సొంతం చేసుకున్నరు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఇదంతా నాటు ముచ్చట. ఆమే బహుజన సమాజ్ వాదీ పార్టీ (బి.ఎస్.పి) అధినేత, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి .
తాజా ఆమె ఎన్నికల సర్వేేలు నిషేధించాలని డిమాండ్ చేశారు. ఉత్తర భారత దేశంంలో రానున్న కొద్ది నెలల్లో రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మాయవతి చేసిన డిమాండ్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచార సభల్లో నిత్యం బిజీగా ఉన్న ఆమె ఈ కీలక ప్రకటన చేసారు. ఎన్నికలలో ముందస్తు సర్వేలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయని బి.ఎస్.పి అధినేత అభిప్రాయ పడ్డారు. కనీసం ఆరు నెలల ముందు నుంచే సర్వేలు చేయడం, ఎగ్జిట్ పూల్స్ నిర్వహించడం వంటి కార్యకలాపాలు నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. అంతే కాదు ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నట్లు మాయవతి ప్రకటించారు.
బహుజన సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు దివంగత కాన్షీరాం వర్దంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గోన్నారు. కాన్షీరాంకు భారత రత్న ఇవ్వాలన్న తన డిమాండ్ ను పునరుద్ఘాటించారు. భారతీయ జనతా పార్టీ పై నిప్పులు చెరిగారు. పశ్చిమ బంగాల్ లో ప్రసార మాధ్యమాలు అన్నీ బి.జె.పి విజయం ఖాయమని పేర్కోన్నాయి. కానీ అక్కడ జరిగిందేమిటి ? మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కాలేదా ? అని మాయావతి ప్రశ్నించారు. ఎన్నికల సర్వేలతో ప్రజలను మఖ్య పెట్టడం తగదన్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో బి.జె.పి తిరిగి అధికారం లోకి వస్తుందంటూ కొ న్ని ఛానళ్లు ప్రచారం చేసున్నాయని, ఇది తగదని హితవు చెప్పారు. ఉత్తర ప్రదేశ్ లో బి.జె.పి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని పేర్కోన్నారు. తప్పుడు సర్వేలు, తప్పుడు ప్రచారాలతో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని తరిగి పొందాలను కుంటోందని మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఆరోపించారు.