ఆ మూడు ఏరియాలలో అదరగొడుతున్న అఖండ2 మూవీ.. కలెక్షన్ల లెక్కలు ఇవే!

Reddy P Rajasekhar
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఈ సంచలన కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం అఖండ 2 ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డుల వేట మొదలుపెట్టిన ఈ సినిమా, కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాలైన నైజాం, సీడెడ్, గుంటూరు జిల్లాల్లో వసూళ్లు వర్షం కురుస్తోంది.

సినిమా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, అఖండ 2 నైజాం ఏరియాలో అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. అక్కడ ఈ చిత్రం ఏకంగా 14 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుని బాలయ్య స్టామినాను మరోసారి చాటింది. ఇక మాస్ ఆడియెన్స్ హబ్ అయిన సీడెడ్ (రాయలసీమ) ప్రాంతంలో ఈ సినిమా 9 కోట్ల రూపాయల షేర్‌ను సాధించి సంచలనం సృష్టించింది. గుంటూరు జిల్లాలోనూ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. ఈ ప్రాంతంలో 4 కోట్ల రూపాయల కలెక్షన్లతో సినిమా దూసుకుపోతోంది.

ఈ కలెక్షన్ల జోరు చూస్తుంటే, మొదటి వారం ముగిసేలోపు ఈ చిత్రం 100 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్‌ను సులభంగా దాటుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నందమూరి అభిమానులకు ఈ చిత్రం నిజమైన పండగలా మారింది. లాంగ్ రన్‌లో ఈ సినిమా నాన్-బాహుబలి రికార్డులను సైతం బద్దలు కొట్టే అవకాశం ఉందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.

కేవలం మూడు రోజుల్లోనే అఖండ 2 ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించి ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచింది. ఇది బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలిచింది. బోయపాటి మార్క్ యాక్షన్, బాలయ్య పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. తొలి మూడు రోజుల కలెక్షన్లు చూస్తుంటే, అఖండ 2 ఫుల్ రన్ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో అన్న ఆసక్తి సినీ అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో నెలకొంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని కొత్త రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: