ఏపీ:SC, ST, BC లకు బంపర్ ఆఫర్..కొత్త స్కీమ్ కు మంత్రి ప్రకటన..!

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు అమరావతి పనులు, మరొకవైపు పోలవరం పనులను పూర్తి చేయడమే కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను సైతం ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం చంద్రబాబు. అంతే కాకుండా మంత్రుల, ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా ప్రత్యేకించి దృష్టి పెట్టారు. కూటమిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న అన్ని అంశాలను కూడా ప్రజలలో బలంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ప్రత్యేకించి గుడ్ న్యూస్ తెలియజేశారు.



సూర్యఘర్ పథకం ద్వారా విద్యుత్ వినియోగదారులకు చాలా మేలు జరుగుతుందని.. ప్రతి నియోజకవర్గంలో 10వేల కనెక్షన్స్ ఇవ్వడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఇందులో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పూర్తిగా ఉచితమని బీసీ అభ్యర్థులకు ప్రత్యేక రాయితీలను ఈ పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తుందని మంత్రి తెలియజేశారు. దీనివల్ల పేదలకు విద్యుత్ చార్జీల భారం కూడా గణనీయంగా తగ్గుతుందని తెలియజేశారు.3K.W సౌర విద్యుత్ ప్లాంట్ ను ఇంటి పైన ఏర్పాటు చేసుకోవచ్చు.. దీని అసలు ఖర్చు రూ.1.50 లక్షలు అవుతుంది.కానీ కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల రాయితీ ఇస్తుంది. ఇందులో K.W  బట్టి రాయితీలు ఉన్నాయని తెలిపారు.


విద్యుత్ చార్జీల పెంపు అనేది ఉండదని వీలైతే తగ్గిస్తామని, చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆచరణలోకి తీసుకుంటున్నామంటూ గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు. గత ప్రభుత్వం పెంచిన ట్రూ ఆఫ్ చార్జీలను, ఇప్పుడు డౌన్ చేసే దిశగా కార్యాచరణ చేపడుతున్నామంటూ తెలియజేశారు. గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారని విద్యుత్ రంగం పైన చంద్రబాబుకు చాలా అపారమైన అనుభవం ఉన్నది, విద్యుత్ వ్యవస్థ ద్వారా ఆదాయాన్ని ప్రజలకు సమకూర్చాలనే ఐడియా కూడా సీఎం చంద్రబాబుగారిదే.. ఈ 18 నెలలు చాలా సంస్కరణలు తీసుకువచ్చి విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టారని తెలియజేశారు. రాబోయే రోజుల్లో సూర్యఘర్ పథకం ఏపీ అంతట ప్రజలు వినియోగించేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: