వామ్మో.. హైదరాబాద్ పోలీసులకే సవాల్?

praveen
ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన ఘటన ఏకంగా పోలీసు వ్యవస్థకే సవాలుగా మారిపోయింది.  సాధారణంగా పోలీసులు కనిపిస్తే ఎవరైనా సరే నిందితులు  పారిపోతారు. ఏకంగా ఒక్కసారిగా భయంతో వణికిపోతారు. కానీ ఇక్కడ నిందితులు మాత్రం తమని పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపైనా ఏకంగా కుక్కలను ఉసిగొల్పడం సంచలనంగా మారిపోయింది   ఈ ఘటన ఇటీవలే హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది అనే విషయం తెలిసిందే . మహమ్మద్ ఆరిఫ్ అనే వ్యక్తి కి గత కొంతకాలంగా జాఫ్రీ అనే వ్యక్తితో ఒక స్థలం విషయంలో వివాదం నడుస్తోంది. ఇక ఇటీవల ఏకంగా 20 మంది గుండాలతో వెళ్లి ఆరిఫ్ ఏకంగా జాఫ్రీ పై దాడి చేశాడు.


 ఈ దాడిలో ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన  సంచలనం గా మారిపోయింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవలే ఫిలింనగర్లోని ఓ ఇంట్లో నిందితులు తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా పోలీసులు వస్తున్నారని గమనించి ఆరిఫ్ తో పాటు అతని చెల్లెలు కూడా ఏకంగా పోలీసుల మీదికి కుక్కలను వదిలారు.  అంతేకాదు పోలీసులపై ఏకంగా ఇంట్లోని వస్తువులను విసురుతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. కత్తులతో సైతం బెదిరించారు. ఇక ఈ ఘటన కాస్త ప్రస్తుతం ఏకంగా పోలీసులకే సవాలుగా మారిపోయింది అని అంటున్నారు విశ్లేషకులు.



 అయితే ఇలా పోలీసులపై కుక్కలను వదిలి నిందితులు తప్పించుకోవడానికి ప్రయత్నించటం పై అటు హైదరాబాద్ పోలీస్ శాఖ సీరియస్గా ఉంది. అయితే ఇప్పటికే ఇక ఈ కేసులోని ప్రధాన నిందితుడుని కూడా అరెస్టు చేశారు పోలీసులు.  అయితే పోలీసులను చూసి భయపడే నిందితులు ఏకంగా పోలీసులపైనే ఎలా దాడి చేయడానికి సిద్ధపడ్డారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఈ కేసు అటు పోలీసులకే సవాలుగా మారిపోయిందని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే నిందితులకు కఠిన శిక్ష వేయాలని ప్రస్తుతం విశ్లేషకులు కోరుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: