ఇండియన్ ఆర్మీ అలర్ట్.. సరిహద్దుల్లో డ్రగ్స్ కలకలం?
అయితే ఇప్పటికే భారత ఆర్మీ వందల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టినప్పటికీ అటు పాకిస్థాన్ నుంచి భారత్ కి అక్రమంగా ఆయుధాలను తరలించడం.. మాదకద్రవ్యాలను తరలించడం అప్పుడప్పుడు బయట పడుతూనే ఉంది. అటు భారత ఆర్మీ కళ్ళు కప్పి ఏదో ఒక విధంగా అక్రమాలకు పాల్పడేందుకు అటు ఉగ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ అటు ఇండియన్ బార్డర్ ఫోర్స్ మాత్రం ఎప్పటికప్పుడు ఉగ్ర వాదుల ఆటలు కట్టిస్తూనే ఉన్నారు. ఇక ఇటీవలే మరోసారి సరిహద్దుల్లో భారీ డ్రగ్స్ పట్టుబడటం సంచలనంగా మారిపోయింది.
నియంత్రణ రేఖ ఎల్వోసీ వెంబడి భారీ మొత్తంలో డ్రగ్స్ ను భారత సైన్యం స్వాధీనం చేసుకుంది. 25 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ ను అధికారులు సీజ్ చేయడం గమనార్హం. జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో loc వెంట ఒక ముఠా ఎంతో అనుమానం గా కనిపించింది. వారి కదలికలు కూడా అనుమానంగా కనిపించడంతో బలగాలు అప్రమత్తమయ్యారు. వెంటనే వారి దగ్గరికి సైన్యం వెళ్ళింది. సైన్యం రావడాన్ని గమనించిన దుండగులు డ్రక్స్ అక్కడే వదిలేసి పారిపోయారు. దీంతో ఇక ఆ మాదకద్రవ్యాలను సీజ్ చేశారు అధికారులు. అయితే ఇక ఈ ఘటన వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది అని భావిస్తున్నారు ఆర్మీ అధికారులు.